Home Film News Bigg Boss 7: బిగ్ బాస్ సీజ‌న్ 7 హోస్ట్ ఎవ‌రో ఈ ప్రోమోతో క్లారిటీ వ‌చ్చేసింది..ఇక ర‌చ్చ ర‌చ్చే..!
Film News

Bigg Boss 7: బిగ్ బాస్ సీజ‌న్ 7 హోస్ట్ ఎవ‌రో ఈ ప్రోమోతో క్లారిటీ వ‌చ్చేసింది..ఇక ర‌చ్చ ర‌చ్చే..!

Bigg Boss 7: తెలుగులో అత్యంత‌ ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. ఈ షో తెలుగులో ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో ఏడో సీజ‌న్ మొద‌లు కానుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా తొలి సీజన్ ప్రేక్ష‌కుల ముందుకు రాగా, దీనికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో నిర్వాహ‌కులు   క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు.  ఆరో సీజ‌న్ లో , ఊహించని సంఘటనలు, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలు అన్నీ ఉన్న‌ప్ప‌టికీ కంటెస్టెంట్స్ ఎలిమినేష‌న్ లో కాస్త తేడా కొట్ట‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సీజ‌న్ 6పై నెగెటివిటీ వ‌చ్చింది.

ఆరో సీజ‌న్ లో వ‌చ్చిన విమ‌ర్శ‌లు పున‌రావృతం కాకుండా సీజ‌న్ 7ని స‌రికొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.  సీజ‌న్‌లో గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది . ఇక హోస్ట్ విష‌యంలో చాలా స‌స్పెన్స్ కొన‌సాగింది. రానా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, బాల‌కృష్ణ‌,వెంక‌టేష్ ఇలా ప‌లువురు పేర్లు ఫ్రేమ్ లోకి వ‌చ్చాయి. కాని తాజా ప్రోమోతో ఫుల్ క్లారిటీ వ‌చ్చింది. బిగ్ బాస్-7 ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా నాగార్జునతో కూడిన ప్రోమోను విడుద‌ల చేయ‌గా,  ఈ సీజ‌న్ కి నాగార్జున‌నే హోస్ట్ అని క్లారిటీ వ‌చ్చింది. ఇక ప్రోమో లో  కుడి ఎడమైతే… పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చేసిన సందడి చూసి ప్రేక్ష‌కులు షోపై అంచనాలు పెంచుకున్నారు.

గ‌త సీజన్స్ ని మించేలా మరింత వైవిధ్యంగా సీజ‌న్ 7 ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  కంటెస్టెంట్స్ కి సంబంధించి అనేక పేర్లు ప్రచారంలో ఉండ‌గా, వారిలో ఎవ‌రు హౌజ్‌లోకి అడుగుపెడ‌తార‌నేది ఆసక్తి క‌రంగా మారింది.  కాగా  సీజన్ 7 ప్రముఖ తెలుగు టెలివిజన్ స్టార్ మా తో పాటు స్ట్రీమింగ్ మాధ్యమం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్ర‌సారం కానుంది.. ఇక‌ 7వ సీజన్ ప్రారంభ తేదీని త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుండ‌గా, దాదాపు ఆగ‌స్ట్ నుండి మొద‌లు కానుంద‌ని ఓ టాక్ న‌డుస్తుంది..

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...