Home Film News ఆసక్తికర నిజజీవిత కథని సినిమాగా..
Film News

ఆసక్తికర నిజజీవిత కథని సినిమాగా..

పింకీ ప్రామాణిక్. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఈ అమ్మాయి(?) రన్నింగ్ లో ఒక ఛాంపియన్. ఎన్నో పోటీల్లో గెలిచి ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చింది. బాగా పాపులర్ అయిపోయి.. వ్యక్తిగతంగా ఒక స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఊహించని షాక్. ఏ దేశం ముందైతే చాలా గర్వంగా నిలబడిందో.. అదే వ్యక్తి తన మీద పడిన నిందతో తల దించుకుంది. కారణం – తను ఒక అబ్బాయని, నా మీద అత్యాచారం చేశాడని పింకీకి తెలిసిన అమ్మాయే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. అంతే! ఒక్కసారిగా ఈ వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది. మరుసటి రోజే ఆమెని అరెస్ట్ చేసి మగవాళ్ళ సెల్ లో ఉంచినట్టు వార్తలు వచ్చాయి. అప్పటికే పింకీ ఒక అబ్బాయని భావించిన వాళ్ళ ఆలోచనలు ఖరారయినట్టు భావించారు. ఏ సాధారణ అమ్మాయి కూడా ఇన్ని పోటీలలో గెలవలేదు అని మాట్లాడుకున్నారు.

అలా.. వాళ్ళు అనుకున్నట్టే.. పింకీ ఒక నమ్మలేని నిజాన్ని బయట పెట్టింది. పోటీల్లో గెలవడం కోసం.. టెస్టోస్టిరాన్ ఇంజక్షన్స్ తీసుకున్నట్లు, అవి తీసుకోవడం వల్ల తన శరీరం మెల్లగా మగవాడిలా కనిపించడం మొదలయింది అని చెప్పింది. కానీ, ఆ అమ్మాయిని నేను అత్యాచారం చేయలేదని తన వాదన వినిపించింది. ఈ విషయంపై ఒక నిర్ధారణ కోసం స్వయంగా కోర్టు ఆమె లింగ నిర్ధారణ కోసం పరీక్షలు చేయించింది. అందులో ఆమె ఆడ కాదని తేలడం.. అందుకు టెస్టోస్టెరాన్ ఇంజక్షన్స్ కారణమని తను చెప్పడం జరిగాయి. ఇంత సంక్లిష్టంగా ఉన్న కథలో.. ఆమె చివరికి ఆ కేస్ నుంచి ఎలా బయటపడింది. తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంది అన్న అంశాలలో ఉన్న డ్రామాని తెరమీదకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని మీడియాకి అందించాడు నిర్మాత అశోక్ పండిట్. ఈ మూవీ ఒక బయోపిక్ గా రాబోతున్నట్టు ఆయన ఒక రిపోర్ట్ లో చెప్పారు. ఈ పాత్రని ఎవరు పోషించబోతున్నారు, మూవీ టీం ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...