Home Film News Skanda: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రామ్-బోయ‌పాటి స్కంద‌..గ్లింప్స్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Film News

Skanda: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రామ్-బోయ‌పాటి స్కంద‌..గ్లింప్స్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Skanda: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను క‌లిసి ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబ‌ధించి అనేక అంచ‌నాలు ఉండ‌గా, తాజాగా ఇచ్చిన అప్‌డేట్ వాటిని మించిపోయింది. చిత్రానికి ‘స్కంద’ అనే పేరును ఖరారు చేస్తూ దానికి ‘ది అటాకర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అలానే చిత్ర‌ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశార. ఇందులో రామ్ చెప్పే డైలాగ్‌తో పాటు బీజీఎం పూన‌కాలు తెప్పిస్తున్నాయి.  నీటిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడుతున్న రామ్ విజువల్స్ అదిరిపోయాయి.  ‘నేను దిగితే ఓడేది ఉండదు. నేను దిగితే మిగిలేది ఉండదు” అంటూ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగుల‌కి గూస్ బంప్స్ వ‌స్తున్నాయి.

చివ‌రిగా అఖండ  సినిమాతో మాస్ హిట్ అందుకున్న బోయ‌పాటి శీను ఇప్పుడు స్కంద చిత్రంతో  రామ్ కెరీర్లో మరో ఊరమాస్ హిట్ పడేలా చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.చివ‌రిగా రామ్  ది వారియర్ సినిమాతో ప్లాప్ అందుకోగా, ఇప్పుడు ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. RAPO20 అయిన స్కంద చిత్రం ఆయ‌న దాహం తీర్చ‌నుంది. నీళ్లలోని ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.  స్కంద మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యే సంస్కృతం పదాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

తమన్ ఎప్ప‌టి మాదిరిగానే త‌న బీజీఎమ్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక  బోయపాటి శ్రీను త‌న‌ సినిమాల్లో హీరోలకు ఆయుధాన్ని అందించ‌డం ఖాయం. ఇప్పుడు స్కందలో కూడా రామ్ పోతినేనికి ఓ వెపన్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే స్కంద అంటే అటాకర్ అని అర్థం వస్తుంది.  ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా, ప్రిన్స్ సిసిల్ విలన్ గా న‌టిస్తున్నారు. సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి ఫీస్ట్ గా ఉంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా ఈ సినిమాలో రామ్‌ని మాసీగా చూపించ‌బోతున్నాడ‌ట బోయ‌పాటి.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...