Home Film News Mrunal Thakur: శృంగార అనుభవం కచ్చితంగా ఉండాలి.. సీతారామం హీరోయిన్ ఇలా పచ్చిగా మాట్లాడేస్తుందేంటి?
Film News

Mrunal Thakur: శృంగార అనుభవం కచ్చితంగా ఉండాలి.. సీతారామం హీరోయిన్ ఇలా పచ్చిగా మాట్లాడేస్తుందేంటి?

Mrunal Thakur: నార్త్ భామ మృణాల్ ఠాకూర్.. హ‌ను రాఘ‌వ‌పూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. చిత్రంలో మృణాల్ క‌నిపించిన తీరు, ఆమె హావ‌భావాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుని కొల్ల‌గొట్టాయి.సీతారామం సినిమాలోనే కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపించిన మృణాల్‌.. ఆ త‌ర్వాత మాత్రం రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇటీవ‌ల ల‌వ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌తో కూడా ప‌ల‌క‌రించింది. ఇందులో అందాల జాత‌ర‌కి తెర‌లేపింది. ఎవరు ఊహించిన విధంగా ఇందులో రెచ్చిపోయింది. మృణాల్‌లో ఇంత బోల్డ్ నెస్ ఉందని వెబ్ సిరీస్  చూసే వరకు ఎవరికీ తెలియదు. మృణాల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందచందాల‌తో కుర్ర‌కారుని మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఈమె ఘాటు అందాలు ఆర‌బోయ‌డ‌మే కాదు బోల్డ్ కామెంట్స్‌తో అంద‌రు స్ట‌న్ అయ్యేలా చేస్తుంటుంది. రీసెంట్‌గా మృణాల్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇప్ప‌టి  రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఒక్క‌రి ఇంట్లో మాట్లాడుకోవాలి అని నేను భావిస్తున్నా.. యూత్‌లో ఉన్నవాళ్లు ఉంటే వాళ్లకి దీనిపై అవగాహాన పెంచాల్సిన అవ‌స‌రం త‌ప్ప‌క ఉంది. శృంగారం గురించి మనం మాట్లాడడానికి సిగ్గు పడకూడదు. ఆ టాపిక్స్ ని నిజాయితీగా పిల్లలకు చెప్పినప్పుడే వారు బయట తప్పుడు సమాచారం తెలుసుకోకుండా ఉంటారని మృణాల్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఆ మ‌ధ్య మృణాల్ ఠాకూర్  తన ఫస్ట్ లవ్ గురించి చెప్పి షాకిచ్చింది.. నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు తొలిసారి ప్రపోజల్ వచ్చింది.. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, అందుకే మెచ్యూరిటీ లేక‌పోయిన కూడా వెంట‌నే ఓకే చెప్పా. అయితే కొన్ని రోజులు అత‌నితో స‌ర‌దాగా గ‌డిపాక విడిపోయా. ప‌ది త‌ర్వాత నేను ఉన్న‌త చ‌దువ‌లు కోసం  ముంబై వెళ్ళిపోయాను.. దాంతో ఇద్దరం దూరం కావ‌ల్సి వ‌చ్చింది. ఇక  సినిమాలోకి రాకముందు మరో వ్యక్తితోకూడా ప్రేమ‌లో ప‌డ్డాను.. కానీ అది  బ్రేకప్ అయింది… ప్రస్తుతానికి అయితే సింగిల్‌గానే ఉన్న‌ట్టు చెప్పిన మృణాల్ ముచ్చ‌ట‌గా మూడో సారి ఎవ‌రి ప్రేమ‌లో ప‌డుతుందా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు ఆమె అభిమానులు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...