Home Film News Poorna: వామ్మో.. పూర్ణ ఏంటి ఇలా మారిపోయింది… గుర్తు ప‌ట్ట‌కుండా ఉందిగా..!
Film News

Poorna: వామ్మో.. పూర్ణ ఏంటి ఇలా మారిపోయింది… గుర్తు ప‌ట్ట‌కుండా ఉందిగా..!

Poorna: న‌టిగా, జడ్జిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో అల‌రించిన పూర్ణ చాలా మందికి సుప‌రిచితం. ఈ అమ్మ‌డు  అసలు పేరు షమ్నా కాసిం. కేరళ రాష్ట్రానికి చెందిన షమ్నా కాసిం.. పూర్ణగా వెండితెరకు పరిచయమయ్యారు. ‘మంజు పోలోరు పెన్‌కుట్టి’ అనే మలయాళ చిత్రం ద్వారా 2004లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ‌.. మూడేళ్ల పాటు మ‌ల‌యాళంలోనే నటించారు. ఇక‌ 2007లో శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  ‘సీమ టపాకాయ్’, ‘అవును’ చిత్రాలు పూర్ణ‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పూర్ణ తెలుగులో న‌ట‌టిస్తూనే  తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గాక పూర్ణ స‌పోర్టింగ్ రోల్‌లో మెరిసింది. ఇటీవ‌లి కాలంలో ఈ భామ  ‘దృశ్యం 2’, ‘అఖండ’, ‘తీస్ మార్ ఖాన్’, ‘దసరా’ సినిమాల్లో పూర్ణ కనిపించారు.

న‌టి పూర్ణ  కొద్ది నెల‌ల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది.  ఇక పెళ్లయిన రెండు నెలలకే అంటే డిసెంబర్‌లో తాను గర్భవతినని పూర్ణ ప్రకటించడం ,  పెళ్లయి ఏడాది తిరగకుండానే పండంటి మగ బిడ్డకు పూర్ణ జన్మనివ్వడం జ‌రిగిపోయింది. పెళ్ల‌య్యాక కూడా భర్త అనుమతితో  పూర్ణ కెరీర్ కొనసాగిస్తుంది. రీసెంట్ గా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ కి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  ఇక సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేసే పూర్ణ తాజాగా త‌న నేచుర‌ల్ లుక్ పిక్స్ కొన్ని షేర్ చేసింది.

ఇందులో పూర్ణ మేక‌ప్ లేక‌పోయిన క్యూట్‌గానే కనిపిస్తుంది కాని, వివాహమయ్యాక బాగా ఒళ్ళు చేసినట్టు క‌నిపిస్తుంది. ఈ లుక్‌లో  పూర్ణ సరికొత్తగా ఉన్నారు. పూర్ణ లుక్స్‌పై నెటిజ‌న్స్ స‌ర‌దా కామెంట్స్ పెడుతున్నారు. ఇక పూర్ణ‌కి మంచి రోల్స్ వ‌స్తే సినిమాల‌లో కూడా న‌టించే అవ‌కాశం ఉంది. త‌న భ‌ర్త త‌న‌కి ఎల్ల‌వేళ‌లా స‌పోర్ట్‌గా ఉంటాడ‌ని, అర్ధం చేసుకుంటాడ‌ని ఆ మ‌ధ్య కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ భామ నిశ్చితార్థం విషయం చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచ‌డం విశేషం. అంద‌రు పూర్ణ‌ని పెళ్లి ఎప్పుడ‌ని ప్ర‌శ్న‌లు వేస్తున్న స‌మ‌యంలో  ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించి షాకిచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...