Home Film News Christmas Fight: బాబోయ్.. క్రిస్మ‌స్ ఫైట్ మాములుగా లేదుగా.. ఏకంగా అన్ని సినిమాలు రిలీజా?
Film News

Christmas Fight: బాబోయ్.. క్రిస్మ‌స్ ఫైట్ మాములుగా లేదుగా.. ఏకంగా అన్ని సినిమాలు రిలీజా?

Christmas Fight: పండ‌గ‌ల‌కు పెద్ద సినిమాలు విడుద‌ల కావ‌డం కొన్ని సంవ‌త్స‌రాల నుండి ఆన‌వాయితీగా వ‌స్తుంది. సంక్రాంతి, ద‌స‌రా, క్రిస్మ‌స్ పండ‌గ‌ల‌కి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డం కామ‌న్. ఈ పండ‌గ‌ల‌కి మూడుకి పైగా సినిమాలు పోటీప‌డుతుంటాయి. ఒక్కోసారి అన్ని సినిమాల‌కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. మ‌రి కొన్ని సార్లు కొన్ని సినిమాలు నిరుత్సాహ‌ప‌రుస్తుంటాయి. అయితే ఈ ఏడాది క్రిస్మ‌స్‌కి భారీ సినిమాలే రిలీజ్ అవుతుండ‌గా, ఇప్పుడు ఈ సినిమాల‌పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. క్రిస్మ‌స్‌కి రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ చూస్తే ముందుగా విక్టరీ వెంక‌టేష్ మూవీ సైంధ‌వ ఉంది.  హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంక‌టేష్ 75వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఇక ఇటీవ‌ల ద‌సరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నారు నాని. ఈ చిత్రం ఎమోషనల్ డ్రామాగా రూపొంద‌నుండ‌గా, ఇందులో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  డిసెంబర్ 21న ఈ  చిత్రాన్ని  రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.  ఇక రీసెంట్‌గా క్రిస్టమస్ రేసులోకి వచ్చిన మరో హీరో నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఎక్స్ట్రా- ఆర్డినరీ మ్యాన్ అనే చిత్రం రూపొందుతుండ‌గా, రీసెంట్‌గా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

మరోవైపు హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ పోతున్న సుధీర్ బాబు జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో హ‌రోం హ‌ర అనే చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  డిసెంబర్ 22న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక బాలీవుడ్ నుండి చూస్తూ షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న‌ డుంకీ  చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేయ‌బోతున్నారు. ప‌ఠాన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత షారూఖ్ ఖాన్ చేస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి క్రిస్మ‌స్ కానుక‌గా మంచి సినిమాలే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా, ఇందులో ఎన్ని హిట్ కొడ‌తాయి, ఎన్ని ఫట్‌మంటాయి అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...