Home Special Looks పెళ్లి చేసుకోని సెలబ్రిటీలెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?
Special Looks

పెళ్లి చేసుకోని సెలబ్రిటీలెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Celebs Who Never Got Married

సినీ పరిశ్రమ మిగతా అన్ని పరిశ్రమలకన్నా కాస్త భిన్నమైనదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు ఉంటారు. అలాగే అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని వాళ్ళు, దాని గురించి అసలెప్పుడూ ఆలోచించని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవరో చిన్న చిన్న ఆర్టిస్ట్ లు ఉంటే వాళ్ళ గురించి ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. కానీ, వీళ్ళు చాలా పెద్ద ఆర్టిస్ట్ లు కాబట్టి వీళ్ళ గురించి ఖచ్చితంగా సామాన్య జనం కూడా ఆలోచిస్తూ ఉంటారు. పైగా సినిమాలలో తమ అందంతో, చరిష్మాతో ప్రేక్షకులని ఆకట్టుకునే వాళ్ళు నిజ జీవితంలో ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారోనన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం.

ముందుగా కొందరు బాలీవుడ్ ప్రముఖుల గురించి చూద్దాం.

  1. టబు

అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి సినిమాల్లో నటించిన టబు నిజజీవితంలో పెళ్లి చేసుకోలేదు. ఆమెకి నచ్చిన వ్యక్తి ఇప్పటికీ దొరికి ఉండకపోవడం ఒక కారణం కావచ్చు. లేదా ఎవరినైనా ప్రేమించి, ఆ ప్రేమ విఫలమై అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలన్న ఆలోచనతో ఉండి ఉండచ్చు. ఏది ఏమైనా టబు లాంటి అందగత్తె తనని తాను ఇప్పటిదాకా ఎవ్వరినీ భర్తగా అంగీకరించలేదంటే ఆమె ఇండిపెండెన్సీని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.

  1. సుష్మితా సేన్

ఒకప్పుడు మిస్ యూనివర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కూడా లైఫ్ లో అస్సలు పెళ్లి చేసుకోలేదు. ఒక అందమైన తారగా ఆమె పలువురు సెలబ్రిటీలతో రిలేషన్స్ ఉండింది అన్న పుకార్లు ఉన్నాయి. కానీ ఆమె ఎవ్వరితోనూ పెళ్లి దాకా వెళ్తుంది అన్న సందర్భాలు లేనట్టుగా ఉన్నాయి.

  1. దివ్యా దత్తా

భాగ్ మిల్కా భాగ్, బద్లాపూర్ వంటి సినిమాల్లో నటించిన దివ్యా దత్తా కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ, ఒక సందర్భంలో మీడియా వాళ్ళు.. “మీరు పెళ్లి చేసుకుంటారా..?” అని అడిగిన ప్రశ్నకు యెస్ అనే చెప్పింది. నేను మ్యారేజ్ మెటీరీయల్ అని కూడా చెప్పిన దివ్యా దత్తా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

  1. అమీషా పటేల్

చాలా తెలుగు సినిమాల్లో నటించిన అమీషా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమెని కూడా మీడియా ఒకసారి ప్రశ్నించినపుడు.. “ఒక అబ్బాయిని చూడండి. పేళ్లు చేసుకుంటాను..” అని సరదాగా సమాధానం చెప్పింది.

వీళ్ళు మనకు తెలిసిన ప్రముఖులు. ఇంకా ఏక్తా కపూర్, ఆశా ఫరేఖ్, తనీషా ముఖర్జీ వంటి లేడీస్.. అలాగే వీళ్ళతో పాటు.. అక్షయ్ ఖన్నా, రాహుల్ బోస్, ఉదయ్ చోప్రా, సాజిద్ ఖాన్, మనీష్ మల్హోత్రా, రణ్ దీప్ హుడా, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, రాహుల్ ఖన్నా, డినో మోరియాలు కూడా పెళ్లి చేసుకోలేదు.

ఇప్పుడు మన సౌత్ లో పెళ్లి చేసుకోని సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.

  1. కోవై సరళ

కోయంబత్తూర్ నుంచి వచ్చిన సరళగా అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాలలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న హాస్య నటి సరళ పెళ్లి చేసుకోలేదు.

  1. ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోలేదు. సెలబ్రిటీగా మారిన తర్వాత ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్రభాస్ వయసు 41. ఇంకా పెళ్లి చేసుకోని అనుష్కతో ప్రభాస్ కలిస్తే చూడాలి అనుకునే వాళ్ళు చాలామందే. ఆమెకి 38.

  1. సితార

పలు తెలుగు సినిమాల్లో నటించిన సితార గారు కూడా పెళ్లి చేసుకోలేదు. అటు మలయాళం, తమిళ్ లోనూ ఆమె ప్రేక్షకులకు పరిచయం. తన కుటుంబానికి దూరం ఐపోవాల్సి వస్తుందని ఆమె పెళ్లి చేసుకోనట్లు చెప్పారు.

రమాప్రభ శరత్ బాబుతో కలిసి ఉన్నప్పటికీ తర్వాత విడిపోయారు. ఆమె కూడా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

త్రిష, అనుష్కా శెట్టి, తమన్నా, నిత్యా మీనన్, పూజా హెగ్డే, ఇలియానా, తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందా, రష్మి, హన్సిక వీళ్ళు ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఇంకా తమిళ్ లక్ష్మీ గోపాలస్వామి, శింబు, వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగు హీరోలైన రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, సిద్ధార్థ్ లు, సీనియర్ నటీమణి అయిన శోభన, నగ్మా, కౌసల్య, కత్రినా కైఫ్ లు కూడా పెళ్లి చేసకోలేదు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...