Home Film News Rana: చాలా నెల‌ల త‌ర్వాత త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టించిన రానా.. భారీ రేంజ్‌లో..
Film News

Rana: చాలా నెల‌ల త‌ర్వాత త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టించిన రానా.. భారీ రేంజ్‌లో..

Rana: ద‌గ్గుబాటి హీరో రానా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవుడిగా క‌నిపించి రానా నేష‌న‌ల్ స్టార్ డం కూడా అందుకున్నాడు. అయితే ఇటీవ‌ల రానాకి సరైన స‌క్సెస్ లు అంద‌డం లేదు. ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా కూడా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఈ ద‌గ్గుబాటి హీరో. అయితే రానా చివరగా `విరాటపర్వం` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రంలో సాయిపల్లవి క‌థానాయిక‌గా న‌టించ‌గా, ప్రియ‌మ‌ణి ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించింది. అయితే ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

విరాట ప‌ర్వం విడుద‌లై చాలా రోజులు అవుతున్నా కూడా రానా త‌న ప్రాజెక్ట్ ఒక్క‌టి కూడా ప్ర‌క‌టించ‌క‌పోయే స‌రికి అభిమానులు ఆందోళ‌న చెందారు. రానా ఎందుకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయ‌డం లేదు అని షాక్ లో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే రానా తాజాగా  శాండియాగో లోని కామిక్ కాన్ ఈవెంట్ లో భాగంగా భారీ ప్రతిష్టాత్మక సినిమా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఒక పోస్ట‌ర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌గా, ఇందులో రానా ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ అందిచ‌నున్నారు. భారీ వ్యయంతో స్పిరిట్ మీడియా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని  నిర్మించనుంది. ఈ చిత్రానికి  సంబంధించి ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణుల వివరాలు  త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

అయితే  ఆ మధ్య రానా త‌న త‌దుపరి చిత్రం  దర్శకుడు తేజతో చేయబోతున్నట్టు ప్రకటించారు. మ‌రి ఇప్పుడు హిర‌ణ్యక‌శ్య‌ప అనే చిత్రాన్ని తేజ‌నే తెర‌కెక్కించ‌నున్నాడా, లేక మ‌రెవ‌రైన డైరెక్ట‌ర్ చిత్రీక‌రిస్తారా అనేది తెలియాల్సి ఉంది.   కామిక్స్ `అమరచిత్ర కథలు` స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి  త్రివిక్రమ్‌ కథ అందిస్తున్నారంటే ప్రాజెక్ట్ లో ఆయన పార్ట్ చాలానే ఉండేలా క‌నిపిస్తుంది.. డైరెక్షన్‌ విభాగంలో కూడా త్రివిక్ర‌మ్ ఇన్వాల్వ్ కాబోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ లెక్క‌న చూసుకుంటే మూవీని కొత్త డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కించే అవ‌కాశం క‌నిపిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...