Home Film News Prabhas: తిరుమ‌ల‌లో ప్ర‌భాస్ సంద‌డి.. ఫొటోలు దిగేందుకు అమితాస‌క్తి చూపిన‌ భ‌క్తులు
Film News

Prabhas: తిరుమ‌ల‌లో ప్ర‌భాస్ సంద‌డి.. ఫొటోలు దిగేందుకు అమితాస‌క్తి చూపిన‌ భ‌క్తులు

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకున్న ప్ర‌భాస్ జూన్ 16న ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.భారీ అంచ‌నాల‌తో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  రాఘవుడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్   సీతగా క‌నిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి  ఓం రౌత్ దర్శకత్వం వహించ‌గా,  భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు. చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలోనే  తిరుపతిలో భారీ ఏర్పాట్లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌ప‌బోతున్నారు. నేడు ఈ ఈవెంట్‌ కనీవినీ ఎరుగని రీతిలో జ‌ర‌బోతున్నారు. శ్రేయాస్ మీడియాఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తుండగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  ప్లానింగ్  చేసార‌ని, తేజ సజ్జా యాంక‌రింగ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.

మ‌రి కొద్ది రోజుల‌లో ఈవెంట్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ నిన్న రాత్రే తిరుప‌తికి చేరుకున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ రోజు ఉద‌యం ప్రభాస్ తో పాటు చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆల‌య అధికారులు ద‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లు చేసారు. ఇక ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్దకి నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆల‌యం లోప‌ల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన పిక్స్ కూడా అభిమానులని ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే  ప్రభాస్ వైట్ షర్ట్ వేసి, పంచెకట్టు కట్టుకొని సాంప్రదాయబ‌ద్ధంగా క‌నిపించారు.

ఇక ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ క‌ళ్ల ముందు క‌నిపిస్తే అభిమానులు, భక్తులు ఊరుకుంటారా.. ఆయ‌న‌తో ఫొటోలు దిగేందుకు ఆస‌క్తి చూపారు.  ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తిరుమ‌ల పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక తిరుపతిలో భారతీయ సినీ చరిత్రలోనే గ‌తంలో ఎప్పుడు చేయ‌ని విధంగా  ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరప‌బోతున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని  కూడా ప్రదర్శించబోతున్నారు. రాముడు, వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్ కూడా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...