Home Film News Akhil: అఖిల్ మాజీ లవర్ బేబి షవర్ వేడుక…సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ
Film NewsGossips

Akhil: అఖిల్ మాజీ లవర్ బేబి షవర్ వేడుక…సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

Akhil: అక్కినేని హీరో అఖిల్.. కొన్నేళ్ల కిందట జీవికే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరుపుకొని పెళ్లి పీటలు ఎక్కే స‌మ‌యంలో బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అస‌లు వారి వివాహం ఎందుకు క్యానిల్స్ అయిందో ఇప్ప‌టి వ‌ర‌కు కార‌ణం తెలియ‌రాలేదు.ఇక అఖిల్ నుండి విడిపోయిన త‌ర్వాత శ్రియా భూపాల్ .. ఉపాసన కజిన్ అనిన్దిత్ రెడ్డి ని వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా హాజ‌ర‌య్యారు .మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పిల్లలతో సహా హాజరై శ్రియా భూపాల్ పెళ్లిలో సంద‌డి చేసింది. ఇక చరణ్ – ఉపాసన లు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

ఉపాసన కు అనిన్దిత్ కజిన్ కావడంతో పెళ్లి వేడుకలో ఉపాసన, చ‌ర‌ణ్‌ల‌ హడావుడి ఎక్కువ‌గా క‌నిపించింది. ఇక‌ తాజాగా శ్రియా భూపాల్ బేబి షవ‌ర్ వేడుక‌లు జ‌ర‌ప‌గా, ఈ కార్యక్ర‌మంలో మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో క‌లిసి సంద‌డి చేశారు. పిక్స్ లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్స్ క‌నిపించ‌గా, ఆయనతో పాటు నమ్రత శిరోద్కర్ అలానే మరికొందరు స్నేహితులు ఉన్నారు. అఖిల్ నుండి విడిపోయిన శ్రియా భూపాల్.. మ‌హేష్ బాబు ఫ్యామిలీకి కూడా ద‌గ్గ‌ర బంధువా అని కొంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. అప్పుడు పెళ్లిలో ఇప్పుడు బేబి ష‌వ‌ర్ వేడుక‌లో మ‌హేష్ ఫ్యామిలీ సందడి చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

ఇక మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే ఆయ‌న చివ‌రిగా స‌ర్కారు వారి పాట చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రంలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండ‌గా, ఇటీవ‌ల మూవీకి సంబంధించి విడుద‌లైన గ్లింప్స్ అంచ‌నాలు భారీగా పెంచింది. ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలానే హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్ బాబు.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...