Home Film News Guntur Kaaram: గుంటూరు కారం పుకార్లకు చెక్.. ట్వీట్‌తో వ‌చ్చిన క్లారిటీ..!
Film News

Guntur Kaaram: గుంటూరు కారం పుకార్లకు చెక్.. ట్వీట్‌తో వ‌చ్చిన క్లారిటీ..!

Guntur Kaaram: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా అనే చిత్రాలు రాగా, అవి రెండు కూడా మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు గుంటూరు కారం అనే టైటిల్‌తో ఈ ఇద్ద‌రు మాస్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. గుంటూరు కారం చిత్రానికి తమన్ ఇచ్చిన సంగీతం మేకర్స్ కి నచ్చడం లేదని.. అందుక‌ని ఆయ‌న‌ని తొల‌గించి వేరే వారిని తీసుకున్నార‌ని ప్ర‌చారాలు వ‌స్తున్నాయి.

అయితే త‌న‌పై వ‌చ్చిన రూమర్స్‌కి ధ‌మ‌న్ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. కడుపు మంటకి అరటిపండు తింటే మంచిది. లేదంటే నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్‌ను ఓపెన్ చేస్తున్నా వచ్చి తాగండి. కడుపు మంటకి మజ్జిగ చాలా మంచిది” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట చక్క‌ర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ క్యాన్సిల్స్ ఇబ్బంది పెడుతున్నాయ‌ని, యాక్షన్‌ సీక్వెన్స్ విషయంలో మహేష్‌ సంతృప్తిగా లేరనే వార్తలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ క్ర‌మంలో పుకార్ల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది.  గుంటూరు కారం చిత్రం నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ని తప్పించడం లేదని ప్రముఖ జ‌ర్న‌లిస్ట్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పష్టం చేశారు.  ఇక‌ ఈ నెల 24 నుంచి నెక్ట్స్ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. చిత్రానికి సంబంధించిన ముందస్తు వర్క్ కూడా జ‌రుగుతున్న‌ట్టు ఆయ‌న తెలియ‌జేశారు.

గుంటూరు కారం చిత్ర రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు జ‌రుగుతుంద‌ని అని ఆయ‌న అన్నారు. గుంటూరు కారం చిత్రాన్ని   సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే టైంకి ప్ర‌భాస్  `ప్రాజెక్ట్ కే`  వ‌స్తే  క‌నుక ..`గుంటూరు కారం` చిత్రాన్ని జనవరి 12న రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో మేక‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాల‌న్నింటిని  ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్‌ చేయగా, దానికి నిర్మాత నాగవంశీ ఓకే చెబుతూ రియాక్ట్ కావడంతో సినిమా పుకార్ల‌కి క్లారిటీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే గుంటూరు కారం  చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...