Home Film News Junior NTR Wishes: మా క్లబ్ లోకి మీకు ఆహ్వానం.. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కి జూనియర్ ప్ర‌త్యేక విషెస్
Film News

Junior NTR Wishes: మా క్లబ్ లోకి మీకు ఆహ్వానం.. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కి జూనియర్ ప్ర‌త్యేక విషెస్

Junior NTR Wishes: పెళ్లైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రుల ప్రమోష‌న్ అందుకున్నారు. కొన్నాళ్లుగా మెగా అభిమానులు ఈ గ‌డియ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఎట్ట‌కేల‌కు నేడు ఉద‌యం ఉపాస‌న ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఇంట సంబురాలు మొద‌ల‌య్యాయి. చిరంజీవి అయితే త‌న ఇంట మ‌రో మ‌న‌వ‌రాలు అడుగుపెట్ట‌బోతున్నందుకు చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖుల‌తో పాటు స్నేహితులు, స‌న్నిహితులు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇక ఇండ‌స్ట్రీలో రామ్ చ‌రణ్‌కి ఎంతో సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా కాస్త వెరైటీగా విషెస్ తెలియ‌జేశాడు.  రామ్ చరణ్ – ఉపాసన దంప‌తుల‌కి నా శుభాకాంక్షలు. పెరెంట్స్ క్లబ్ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతి క్షణం చాలా ఉద్వేగంగా ఉంటుంది. దేవుడు ఆమెను, మీ అందరికీ మరింత సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా విష్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ . ఇప్పుడు జూనియ‌ర్ చేసిన  ట్వీట్ నెట్టింట‌ వైరల్ గా మారింది.

కాగా, ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ ఎప్ప‌టి నుండో మంచి స్నేహితులు కాగా, వీరిద్ద‌రి స్నేహాన్ని గుర్తించిన రాజ‌మౌళి వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో ట్రిపుల్ ఆర్ అనే చిత్రం చేశాడు.  ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో  మ‌నం చూశాం. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో సంద‌డి చేశారు. ఈ చిత్రం వీరిద్దరికి  గ్లోబల్ స్టార్స్ గాను గుర్తింపు తెచ్చిపెట్టింది.ఇక  ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు వార్ 2 అనే బాలీవుడ్ చిత్రం చేస్తున్నాడు. మ‌రో వైపు  రామ్ చరణ్ శంకర్ ప్ర‌స్తుతం శంక‌ర్  దర్శకత్వంలో  ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపాస‌న ప్రెగ్నెంట్ కావడంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చాడు చ‌ర‌ణ్‌.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...