Home Film News Ambati: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి న‌లుగురు భార్య‌లు గుణ‌పాఠం చెప్పే క‌థ‌తో సినిమా.. అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Film News

Ambati: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి న‌లుగురు భార్య‌లు గుణ‌పాఠం చెప్పే క‌థ‌తో సినిమా.. అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ambati: న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాన్స్ దొరికితే చాలు వైసీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు వారాహి యాత్ర‌లో భాగంగా వైసీపీ నాయ‌కులని చీల్చి చెండాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు  బ్రో సినిమాతో కూడా వారిపై సెటైర్స్ వేసార‌ని అంటున్నారు. ముఖ్యంగా చిత్రంలో శ్యామ్ బాబు పేరుతో అంబ‌టి రాంబాబుని దారుణంగా ఓ ఆట ఆడుకున్నార‌ని కొంద‌రు ఆరోపించారు. దీనిపై అంబ‌టి కూడా స్పందించారు. రాజ‌కీయంగా ఎదుర్కోలేక త‌న‌ని ఇలా త‌ప్పుగా చూపించార‌ని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు అంబ‌టి. ఇక తాజాగా బ్రో నిర్మాత‌ల నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి భారీ  ప్యాకేజీ అందుతోందని మంత్రి ధ్వజమెత్తారు.

ప్ర‌స్తుతం  పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాకు ఏ మాత్రం కలెక్షన్లు లేవు. సినిమా అట్టర్‌ ప్లాప‌క‌. రాంబాబు, శ్యాంబాబు అని ప్రచారం చేసుకుంటే మరో కోటి రూపాయలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.  చంద్రబాబు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి, విశ్వప్రసాద్‌కు ఇస్తే.. ఆయన ప్యాకేజిని పవన్‌కు అందిస్తారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్‌ ద్వారా ఆయ‌న ఇస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు  పవన్‌ కల్యాణ్  ఎంతడబ్బు తీసుకున్నారు? ఈ డబ్బును ఐటీలో చూపించారా? లేదా? పవన్ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. విశ్వప్రసాద్‌ బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా చేసి పవన్‌కు ఇచ్చే కుట్ర కనిపిస్తుంద‌ని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు.

మ‌రోవైపు త్వ‌ర‌లో ప‌వన్ క‌ళ్యాణ్‌కి న‌లుగురు భార్య‌లు గుణ‌పాఠం చెప్పే క‌థ‌తో సినిమా చేస్తాన‌ని అంబ‌టి రాంబాబు అన్నారు. సినిమాకి కొంద‌రు పేర్లు కూడా సూచించారని ఆయ‌న అన్నారు.   నిత్యపెళ్లి కొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి – ఎగతాళి, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రవీణుడు, M R O- మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్స్‌, అయిన పెళ్లిళ్లు ఎన్నో.. పోయిన చెప్పులు ఎన్నో?’ ఇలా ప‌లు టైటిల్స్ ప్ర‌స్తుతం ప‌రిశీలనలో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  చదువు సరిగా అబ్బక..  అన్నయ్య దగ్గర కూడా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ… రౌడీయిజం చేస్తూ.. అన్నల్లో కలుస్తా అనేవాడు.. ఏ దిక్కులేక సినిమాల్లోకి వ‌చ్చాడు. అనుకోకుండా  ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయ్యాడు అత‌ని ప‌రిస్థితి మేడిపండు సామెత‌లా ఉంటుంది. సంసారం చేస్తూనే మరో మహిళతో సంబంధాలు, అత‌నికి నలుగురు భార్యలు గుణపాఠం చెప్పే కథతో మూవీ రూపొందుతుంది. ఈ చిత్రానికి  పేర్లు, రచనలు జరుగుతున్నాయి’ అని అంబటి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...