Home Film News Tholiprema: పెద్ద‌గా క‌నిపించని తొలి ప్రేమ రీరిలీజ్ ప్ర‌మోష‌న్స్.. బుక్సింగ్స్ జోరు మాత్రం పీక్స్‌లో
Film News

Tholiprema: పెద్ద‌గా క‌నిపించని తొలి ప్రేమ రీరిలీజ్ ప్ర‌మోష‌న్స్.. బుక్సింగ్స్ జోరు మాత్రం పీక్స్‌లో

Tholiprema: ప్ర‌తి హీరోకి కూడా వారి కెరీర్‌లో ఒక ప్ర‌త్యేమైన సినిమా ఒక‌టి అంటూ ఉంటుంది. అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ మ‌రింత పెంచిన చిత్రం తొలి ప్రేమ‌. పాతిక‌ళ్ల క్రితం విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టికీ టీవీల‌లో వ‌చ్చిన కూడా అభిమానులు ఎగ‌బ‌డి చూస్తుంటారు. మ‌రి ఆ మూవీ అంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సంద‌ర్భంగా జూన్ 30న చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన జల్సా, ఖుషీ సిమాలు రీ రిలీజ్ అయి మంచి వసూళ్లనే సాధించాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ‘తొలిప్రేమ’ సినిమా కూడా 4K లో విడుద‌ల చేసి ఆ చిత్రానికి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టేలా ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఇటీవ‌ల ట్రైల‌ర్ రిలీజ్ కోసం ప్ర‌త్యేక ఈవెంట్ కూడా నిర్వ‌హించారు.

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ తొలిప్రేమ చిత్రాన్ని జి.వి.జి.రాజు నిర్మించారు. జూలై 24 నాటికి ఈ చిత్రం విడుద‌లై పాతికేళ్లు అయింది. తొలి ప్రేమ చిత్రం ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేట‌ర్‌లో తెగ ఆడేసింది. ఇప్పుడు అదే థియేట‌ర్‌లో ఈ మూవీ రీరిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే థియేట‌ర్ ద‌గ్గర ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ క‌టౌట్ కూడా ఏర్పాటు చేశారు.  50 అడ‌గుల ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌టౌట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే  కొన్ని షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. వాటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓపెన్ అయిన బుకింగ్స్ అన్ని హౌజ్ ఫుల్ అయ్యాయి.

తొలి ప్రేమ రీరిలీజ్‌కి పెద్ద‌గా ప్ర‌మోష‌న్ చేసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ బుకింగ్స్ మాత్రం శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. చూస్తుంటే రీరిలీజ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పేరిట ఉన్న రికార్డుని తానే చెరుపుకునేలా క‌నిపిస్తున్నాడు. ఇక ఇటీవ‌ల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎవ‌రైన  డ‌బ్బులు లేవంటే ‘తొలి ప్రేమ’ సినిమాను రీ రిలీజ్ చేసుకునే వాడినంటూ ఆయ‌న చెప్ప‌డం విశేషం. తొలి ప్రేమ చిత్రం 21 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోగా, మూడు సెంటర్లలో నేరుగా 200 రోజులు ఆడింది. ఇక  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య 70 ఎం.ఎం. థియేటర్లో 217 రోజులాడింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...