Home Film News మేనల్లుడి మొదటి సినిమా టీజర్ లాంచ్ చేసిన మహేష్ బాబు!
Film News

మేనల్లుడి మొదటి సినిమా టీజర్ లాంచ్ చేసిన మహేష్ బాబు!

Mahesh Babu launches Hero Teaser

అశోక్ గల్లా. స్వయంగా మహేష్ బాబుకి మేనల్లుడు. ఆయన సోదరి పద్మావతి-జయదేవ్ గల్లా ల కుమారుడు. ఇప్పుడితను తన మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నాడు. ‘హీరో’ టైటిల్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మహేష్ బాబు తన అభిమానులకి రిలీజ్ చేశారు ట్విటర్ లో. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సినిమాని సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమర్ రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.

ఈ టీజర్ ఆసక్తిగా కనిపిస్తుంది. ఒక ఎడారి ప్రాంతంలో వెళ్తున్న రైలుపై నడుస్తూ, సిగార్ కాలుస్తూ, మరో చోట గుర్రం పై స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు అశోక్ గల్లా. చివర్లో హాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ జోకర్ లా కనిపిస్తూ.. అద్దంలో తనని తాను చూసుకుంటూ ‘why so serious’ అనే డైలాగ్ చెప్పడం కథాంశాన్ని అంచనా వేయలేకుండా ఉంది. మహేష్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ నటన చూడాలంటే మరింత కాలం ఎదురు చూడాల్సిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసాడు. చాలా కాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. రామ్ చరణ్ కూడా సినిమాని ప్రకటించిన సంధర్భంలో అశోక్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇష్టంతో తన తాతయ్య, మేనమామల సినిమాలని విపరీతంగా చూస్తూ.. సింగపూర్, ఆమెరికాలలో సినిమామీదనే డిగ్రీలు చేసి.. యాక్టింగ్ లో మంచి ట్రైనింగ్ పొందిన ఈ ”హీరో” జర్నీ ఎలా ఉండబోతుందో మరింత కాలం వేచి చూద్దాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...