Home Film News Vijay Deverakonda : వామ్మో విజయ్.. ఏంటీ అరాచకం!
Film News

Vijay Deverakonda : వామ్మో విజయ్.. ఏంటీ అరాచకం!

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క పిక్‌తో సినిమా ఇండస్ట్రీ, ఫ్యాన్స్, ఆడియన్స్‌కి షాకిచ్చాడు. ఇప్పుడు దేశమంతా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా విజయ్ ఫొటో వైరల్ అవుతుంది. నెట్టింట అతని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

వీడీ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రంపంచ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ‘లైగర్’ ట్యాగ్ లైన్ ‘‘సాలా క్రాస్ బీడ్’’ పేరుతో న్యూ గ్లింప్స్ వదిలారు.

‘లైగర్’ లో ఇంతకుముందు విజయ్ లుక్ చూశాం కాబట్టి.. ఈ పోస్టర్‌లో సేమ్ హెయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గానే ఉన్నాడులే అనుకుంటే సాలిడి షాక్ ఇచ్చాడు. చేతికి బాక్సింగ్ గ్లౌవ్స్‌తో పూర్తి నగ్నంగా.. ప్రైవేట్ పార్ట్ ముందు ఫ్లవర్ బొకే అడ్డు పెట్టుకుని అందరూ అదరిపోయేలా చేశాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వైరల్‌కి వైరస్ వచ్చినంత వేగంగా వ్యాపిస్తోంది. ఆగస్టు 25న ‘లైగర్’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...