Home Film News Naa Peru Seesa : థియేటర్లలో ‘మాస్ మహారాజా’ ఫ్యాన్స్ రచ్చ రంబోలా చెయ్యడం ఖాయం..
Film News

Naa Peru Seesa : థియేటర్లలో ‘మాస్ మహారాజా’ ఫ్యాన్స్ రచ్చ రంబోలా చెయ్యడం ఖాయం..

Naa Peru Seesa Song
Naa Peru Seesa Song

Naa Peru Seesa: మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నారు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్.. కొంత గ్యాప్ తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. శనివారం ‘సీసా’ లిరికల్ సాంగ్ వదిలారు. అన్వేషి జైన్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.

‘నా పేరు సీసా.. ఒకరికి నే తేనె సీసా.. ఒకరికి నే కల్లు సీసా.. ఒకరికి నే మసాల సీసా.. ఇంకొకరికి రసాల సీసా.. అందరికీ, అందరకీ, అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’’ అంటూ.. సామ్ సిఎస్ ట్యూన్‌కి చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్ రాయగా.. ‘మెలోడీ క్వీన్’ శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు. మాస్ మహారాజా ఫ్యాన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుందీ పాట.

రవితేజ పంచెకట్టులో క్లాస్ టచ్ ఉన్న మాస్ స్టెప్స్ వేశారు. ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లిరికల్ సాంగే ఈ రేంజ్‌లో ఉందంటే.. ఇక థియేటర్లలో మాస్ మహారాజా ఫ్యాన్స్ రచ్చ రంబోలా చెయ్యడం పక్కా అని చెప్పొచ్చు.. జూలై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...