Home Film News Soundarya: ఏంటి.. సౌంద‌ర్య‌కి కొడుకు ఉన్నాడా.. ఇంత కాలానికి బ‌య‌ట‌ప‌డ్డ ప‌చ్చి నిజం..!
Film News

Soundarya: ఏంటి.. సౌంద‌ర్య‌కి కొడుకు ఉన్నాడా.. ఇంత కాలానికి బ‌య‌ట‌ప‌డ్డ ప‌చ్చి నిజం..!

Soundarya: తెలుగు సినిమాపై చెర‌గ‌ని ప్ర‌తి రూపంగా నిలిచింది సౌంద‌ర్య. ఆమె అందానికి మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది సౌంద‌ర్య‌. కన్నడనాట పుట్టినా.. తెలుగు ప్రజలు ఆమెని దగ్గర చేసుకున్న తీరు అమోఘం. సినిమా పరిశ్రమలో కొంతమంది మహానటులు మన మధ్య లేకపోయినా కూడా వారు తమ పాత్ర‌ల‌తోమన మనసులలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో సౌంద‌ర్య ఒక‌రు. మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత సౌందర్య అంత‌టి పేరు తెచ్చుకుంది. మనవరాలి పెళ్లితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన‌ సౌందర్య.. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో అల‌రించింది. ఆ త‌ర్వాత హలో బ్రదర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ద‌క్కించుకుంది.

అమ్మోరు, పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సినిమాల‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించి అల‌రించింది సౌంద‌ర్య‌. చనిపోయేంతవరకూ హీరోయిన్ గానే ఉన్న సౌంద‌ర్య‌.. ఆ నాటి రోజుల‌లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న ఏకైన హీరోయిన్ గా నిలిచింది. నెంబర్ వన్ స్థానంలోనే ఉంటూ క‌న్నుమూసిన క‌న్న‌డ క‌స్తూరి.. ర‌ఘు అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. అత‌నంటే ఆమెకి చాలా ఇష్టం కావ‌డంతో ఆస్తులు అన్నీ కూడా అత‌ని పేరిట రాసింది.

 

సౌంద‌ర్య మ‌ర‌ణించిన త‌ర్వాత ఆస్తుల విషయంలో రఘు మరియు సౌందర్య తల్లిదండ్రులకు గొడవలు జరిగాయని అదే విధంగా కొన్నాళ్ల తర్వాత రఘు మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని గోవాలో నివాసం ఉంటున్న‌ట్టు స‌మాచారం. అయితే సౌందర్య చనిపోయే స‌మ‌యానికి ఆమెకు కొడుకు ఉన్నాడని అప్ప‌ట్లో ప్ర‌చారాలు న‌డిచాయి. సౌందర్య మరణించడంతో అతని బాధ్యతలు రఘు తీసుకున్నాడని కూడా అన్నారు.. అయితే ఈ ప్రచారంపై సౌందర్య సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆమె పెళ్లయిన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ అయింది. అందుకని ఆమె చనిపోయేనాటికి పిల్ల‌లు లేరు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు అని వారు చెప్పుకొచ్చారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...