Home Film News Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది..
Film News

Chandramukhi 2 : ‘చంద్రముఖి 2’ వచ్చేస్తోంది..

Chandramukhi 2
Chandramukhi 2

Chandramukhi 2: ‘చంద్రముఖి’.. కన్నడ బ్లక్ బస్టర్ ‘ఆప్తమిత్ర’ ఆధారంగా పలు భాషల్లోకి రీమేక్ అయిన ఈ సినిమాని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. హారర్, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘ఆప్తమిత్ర’ కి సీక్వెల్‌గా డైరెక్టర్ పి.వాసు ‘ఆప్తరక్షక’ తీసి మరలా సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఈ సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ‘నాగవల్లి’ పేరుతో రీమేక్ చేశారు. గతకొద్ది రోజులుగా ‘చంద్రముఖి 2’ రాబోతున్నట్లు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ‘చంద్రముఖి 2’ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

పి.వాసు దర్శకత్వంలో.. పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నారు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో వచ్చిన ‘శివలింగ’ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ‘చంద్రముఖి’ లో తాను భయపడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వడివేలు కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్టర్‌గా ‘పద్మశ్రీ’ తోట తరణి పని చెయ్యబోతున్నారు. ‘స్వరవాణి’ కీరవాణి సంగీతమందిచబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్ కూడా వర్క్ చేయనున్నారు. ప్రొడ్యూసర్ సుబాస్కరన్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...