Home Film News బాలీవుడ్ లో సలార్‌కు భారీ టార్గెట్… ప్రభాస్ సేఫ్ అవ్వాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే..!
Film News

బాలీవుడ్ లో సలార్‌కు భారీ టార్గెట్… ప్రభాస్ సేఫ్ అవ్వాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే..!

ఇప్పుడు ఇండియన్ సినీ ప్రేక్ష‌కులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న సినిమా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్.. ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మెప్పించలేకపోయిన ప్రభాస్ ఆరు నెలల గ్యాప్‌తో మరోసారి స‌లార్‌ సినిమాతో బాక్సాఫీస్ పై గర్జించబోతున్నాడు.

Salaar Teaser Trailer, Prabhas, Prithviraj sukumaran, Jagapathi Babu,  Prashanth Neel, shruti hassan - YouTube

కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ యాక్షన్ డ్రామా పై తెలుగు స్టేట్స్ లోనే కాకుండా అటు సౌత్ నుంచి నార్త్ వరకు మంచి హైప్‌ నెలకొంది.. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా కోసం అక్క‌డి సినిమాను ఆపుకొను మరీ చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభాస్ సలార్ సినిమాకు పోటీగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఢంకీ సినిమా రిలీజ్ అవుతుంది. సలార్ బాలీవుడ్ బిజినెస్ ఎవరు ఊహించిన రేంజ్ లో జరిగింది. నార్త్ మార్కెట్లో ఎంత రాబడితే ? స‌లార్ సేప్‌ అవుతుంది అన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

Salaar' vs 'Dunki' advance booking in India: SRK's film sells tickets worth  Rs 4.5 cr; trumps Prabhas-starrer actioner - BusinessToday

సలార్ మూవీ బాలీవుడ్ మార్కెట్లో రూ.200 కోట్లకు పైగా షేర్ రాబడితేనే అక్కడ అది సేఫ్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద టార్గెట్.. ఒక్క బాలీవుడ్ లోనే రూ.200 కోట్లు షేర్ అంటే కనీసం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రావాలి. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చే వసూళ్లపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక కే జి ఎఫ్ సినిమాలు బాలీవుడ్లో అదిరిపోయే కలెక్షన్లు అందుకున్నాయి. ఆ రేంజ్ లో సలార్ కు వసూళ్లు వస్తే ప్రభాస్ కు బాలీవుడ్లో అదిరిపోయే హిట్ వచ్చినట్టే అనుకోవాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...