Home Film News Mahesh Babu : న్యూయార్క్ స్ట్రీట్స్‌లో సూపర్‌స్టార్ సందడి.. వీడియో వైరల్
Film News

Mahesh Babu : న్యూయార్క్ స్ట్రీట్స్‌లో సూపర్‌స్టార్ సందడి.. వీడియో వైరల్

SSMB
SSMB

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని మరీ ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు భార్య, పిల్లలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.

ఇటీవలే ‘సర్కారు వారి పాట’ తో సాలిడ్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ కొద్ది రోజులుగా విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. వాళ్ల టూర్ విశేషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె.

రీసెంట్‌గా మహేష్, నమ్రత కలిసి అమెరికాలోని న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్‌లో తిరుగుతూ సందడి చేస్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ‘న్యూయార్క్ నగరం నిదరోయె వేళా’ అనే పాటతో ఈ వీడియోని అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు. మహేష్ ఎప్పటిలానే హ్యాండ్సమ్‌గా సూపర్ స్టైలిష్ లుక్‌లో బాగున్నాడు.

https://www.instagram.com/p/CfELCDOF9qv/

జూన్ 23 నుండి ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కొన్ని చోట్ల 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోబోతోంది. అలాగే మహేష్ బర్త్‌డే (ఆగస్టు 9)కి 50 రోజులు ముందుగానే ఫ్యాన్స్ నెట్టింట సందడి స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యబోయే సినిమా త్వరలో ప్రారంభం కానుంది. తర్వాత రాజమౌళితోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు సూపర్‌స్టార్.

https://www.instagram.com/p/Ce06_FyviTM/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...