Home Film News Varun Tej : ‘సాహో’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్
Film News

Varun Tej : ‘సాహో’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్

Varun Tej - Sujeeth
Varun Tej - Sujeeth

Varun Tej: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ ఫిలిం ‘గని’ ఊహించని షాక్ ఇచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో, కొత్త దర్శకుడు భారీ స్టార్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన ‘గని’ భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగింది.

కట్ చేస్తే.. అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు 23 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఈ మూవీతోనే ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ తన స్నేహితుడితో కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు. దీంతో తర్వాతి సినిమా విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నాడు వరుణ్ తేజ్.

ప్రస్తుతం మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి కథలు వినే పనిలో ఉన్నాడు. ఈ ప్రాసెస్‌లో ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ చెప్పిన స్టోరీ లైన్ వరుణ్‌కి నచ్చిందని తెలుస్తోంది.

కథ నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చెయ్యమని వరుణ్ తేజ్, సుజీత్‌కి చెప్పాడని.. ప్రస్తుతం సుజీత్ అదే పనిలో ఉన్నాడని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని ఫిలింనగర్ టాక్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...