Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంటర్.. ‘సర్కారు వారి పాట’..
మే 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కి లాభాలు తెచ్చి పెట్టింది. మహేష్ పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, పరుశురామ్ టేకింగ్, డైలాగ్స్.. థమన్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, మది విజువల్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.
తమ సినిమా పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. కొద్ది రోజులుగా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ 199 రూపాయల చొప్పున రెంట్ పే చేసి సినిమా చూసే విధానాన్ని తీసుకొచ్చాయి. దీంతో ప్రేక్షకుల నుండి కాస్త అసహనం వ్యక్తమైంది. ‘సర్కారు వారి పాట’ విషయంలో అలాంటి నిబంధనలేవీ లేవని.. సబ్స్క్రైబర్స్ ఉచితంగానే సినిమా చూడొచ్చని తెలిపారు నిర్మాతలు.. జూన్ 23 నుండి తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. #SarkaruVaariPaataOnPrime
 
 
 
	 
	 
	 
	 
  
  
  
	 
	 
	 
	 
	 
	 
	 
	
Leave a comment