Home Film News Ranga Ranga Vaibhavanga : టీజర్ అదిరింది.. మెగా మేనల్లుడు ఇరగదీశాడుగా..
Film News

Ranga Ranga Vaibhavanga : టీజర్ అదిరింది.. మెగా మేనల్లుడు ఇరగదీశాడుగా..

Ranga Ranga Vaibhavanga Teaser
Ranga Ranga Vaibhavanga Teaser

Ranga Ranga Vaibhavanga: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడవ సినిమా ‘రంగ రంగ వైభవంగా’.. ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ ని తమిళ్‌లో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసిన గిరీశయ్య డైరెక్ట్ చేస్తున్నారు.

సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిలింకి రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. టైటిల్‌తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన హీరో హీరోయిన్ల క్యారెక్టర్ తాలూకు లుక్స్ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. సోమవారం ‘రంగ రంగ వైభవంగా’ టీజర్ రిలీజ్ చేశారు.

‘ఉప్పెన’, ‘కొండపొలం’ సినిమాల్లో గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమకథల్లో నటించిన వైష్ణవ్.. ఈ సినిమాలో అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫస్ట్ టైమ్ క్లాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. వైష్ణవ్, కేతికల కెమిస్ట్రీతో పాటు వాళ్ల రిలేషన్, గొడవలు, రివేంజ్ వంటి అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.

శ్యామ్ దత్ విజువల్స్, దేవి శ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరించేలా ఉన్నాయి. టీజర్‌ని బట్టి ‘రంగ రంగ వైభవంగా’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగానూ, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలోనూ వైష్ణవ్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చెయ్యనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...