Home Film News విషాదం.. దర్శకుడు సూర్య కిరణ్ మరణానికి.. అదే కారణమా..?
Film News

విషాదం.. దర్శకుడు సూర్య కిరణ్ మరణానికి.. అదే కారణమా..?

ఇటివల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మ‌ర‌ణిస్తువ‌స్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు లతో కొంతమంది కన్నుమూస్తే.. ఇండస్ట్రీలో కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరికొంతమంది సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

నటి కల్యాణి మాజీ భర్త, డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత

సత్యం డైరెక్టర్ , బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ కంటెంట్ సూర్య కిరణ్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం తుది శ్వాస విడిచినట్టుగా సమచారాం అందుతోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు ఆయన అంత్య క్రియలు జరుగనున్నాయని సమాచారం. తెలుగులో సత్యం, ధన 51, రాజు భాయ్ వంటి చిత్రాలతో మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతే కాకుండా బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు.

Bigg Boss 4 Telugu: సూర్య కిరణ్, కళ్యాణి సహా విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు  వీళ్లే.. – News18 తెలుగు

మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషలలో 200 చిత్రాలకు పైగా నటించి ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. హీరోయిన్ కల్యాణితో వివాహం, విడాకుల విషయంతో సూర్య కిరణ్ ఎక్కువగా కాంట్రవర్సీలోకి వచ్చాడు.ఇదిలా ఉండగా.. గతంలో ఇతను హీరోయిన్ కళ్యాణి ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు కలిసున్న వీరు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి అన్న విషయం పై ఎవ‌రికి ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ 4 టైంలో కూడా సూర్య కిరణ్.. ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. అయితే గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కళ్యాణితో తాను విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చాడు.

Surya kiran : నేను విడాకులు వద్దు అని కళ్యాణి కి చెప్పే స్థాయిలో లేను :  సుజిత - We Coudnt Make Possible For Kalyani And Surya Kiran

మేము 10 ఏళ్ళు కలిసున్నాం. విడాకులు తీసుకోవడానికి కారణాలు అంటూ ఏమీ లేవు. మేము విడాకుల కోసం కోర్టు కి వెళ్ళినప్పుడు.. జడ్జిగారు మమ్మల్ని కారణాలు అడిగారు. నాకైతే ఏమీ లేవు. ‘మీరే చెప్పండి’ అని నేను కళ్యాణి గారితో అన్నాను. అప్పుడు ఆమెను జడ్జి గారు ప్రశ్నలు అడిగారు. ‘ఏవమ్మా.. అతను నిన్ను కొడతాడా, నిన్ను తిడతాడా, అతని ఫ్యామిలీ నిన్ను ఇబ్బంది పెడుతుందా?’ అంటూ అడిగారు..! వాటికి ఆమె ‘ఉహూ’ అనే సమాధానం ఇచ్చింది.

సినీ ఇండస్ట్రీలో విషాదం.. తెలుగు దర్శకుడు కన్నుమూత - Mana Telangana

మీరు విడిపోతే మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? అని జడ్జి గారు అడిగారు. అప్పుడు నేను ‘మాకు పిల్లలు లేరు సర్’ అని చెప్పాను. అప్పుడు జడ్జి గారు ‘ఓహో పిల్లలు లేరని విడిపోవాలి అనుకుంటున్నారా?’ అని అన్నారు. ఆయనే డిసైడ్ చేసేసారు. మంచి రీజన్ దొరికింది అని మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. తర్వాత బయటకు వచ్చాక కళ్యాణి గారితో అన్నాను. ‘మీరు వెయిట్ చేయండి, డబ్బులు వచ్చాక అప్పులు అన్నీ తీర్చేద్దాం.. మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని’ చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య‌కీర‌ణ్‌. సో వీరి విడాకులకు ఆస‌లు రీజన్ ఆర్థిక ఇబ్బందులు అని స్పష్టమవుతుంది. అలాగే కళ్యాణి గారు అంటే సూర్య కిరణ్ కి ఎంతో ప్రేమ ఉంది అని.. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మృతి.. దిగ్భ్రాంతిలో చిత్ర పరిశ్రమ – News18 తెలుగు

అయితే కళ్యాణి తో విడిపోయాక సూర్య కిరణ్ మానసికంగా ఎంతో కృంగిపోయాడు.. మద్యానికి స్టికెరేట్లకు బానిస అయ్యే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు.. కళ్యాణితో విడాకుల తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన వాటన్నింటినీ వదులుకొని ఆర్థికంగా కూడా చితికిపోయాడు. ఇక గతంలో కూడా సూర్యకిరణ్‌ చెల్లి సుజాత కూడా తన అన్నకు సహాయం చేయాలని ఎంత చూసినా సూర్య కిరణ్ ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాడు.ఇక గత కొంత కాలం నుంచి పచ్చ కామెర్లతో బాధపడుతున్న సూర్య‌కీర‌ణ్ కు ఈ రోజు ఉద‌యం గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఆయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఆయన మరణానికి పరోక్షంగా ఇప్పుడు కళ్యాణే కారణమైందని.. ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...