Home Film News Sohel: నన్ను తేడా గాడివా అంటూ అవమానించారు.. కన్నీళ్లు పెట్టుకుంటూ తన భాధ చెప్పిన సోహైల్
Film News

Sohel: నన్ను తేడా గాడివా అంటూ అవమానించారు.. కన్నీళ్లు పెట్టుకుంటూ తన భాధ చెప్పిన సోహైల్

Sohel: సోహైల్ అని పేరు చెప్పగానే అతనిని ఎవ‌రు పెద్ద‌గా గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కాని బిగ్ బాస్ సోహైల్ అంటే మాత్రం వెంట‌నే గుర్తు ప‌డతారు. బిగ్ బాస్ లో సోహైల్ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. చికెన్ మ‌ట‌న్ అంటూ పాట‌లు పాడుతూ..త‌న జోలికి వ‌చ్చిన వారిని క‌థ వేరుంట‌ది అని బెదిరించ‌డం మ‌నం చూశాం. బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా కూడా సోహైల్‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది. అంతేకాదు రెమ్యున‌రేష‌న్ కూడా గ‌ట్టిగానే అందిపుచ్చుకున్నాడు. బిగ్ బాస్ ఫేమ్‌తో ఫుల్ సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్న సోహైల్ గ‌తంలో ఒకటి రెండు సినిమాల‌తో అల‌రించాడు. ఇప్పుడు మిస్టర్ ప్రగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విభిన్నమైన కథాంశంతో రూపొంద‌నున్న‌ ఈ సినిమాని ఆగస్టు 18న విడుదల చేయ‌నుండ‌గా, ప్ర‌స్తుతం ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. త‌న సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియ‌జేస్తూ ఫుల్ ఎమోష‌న‌ల్ అయ్యారు సోహైల్. చిత్రంలో సోహెల్ ప్రెగ్నెంట్‌ గా కనిపించనుండ‌గా, ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెర‌కెక్కించాడు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన‌న్ని నిర్మించారు. చిత్రంలో సోహెల్ కు జోడీగా రూపా కొడవాయుర్ నటిస్తుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోహెల్ మాట్లాడుతూ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 

మిస్టర్ ప్రగ్నెంట్ మూవీ షూటింగ్ సమయంలో త‌న‌ను చాలా మంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడ సోహైల్‌. నన్ను చాలా మంది ఎన్నో మాట‌లు అన్నారు. చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు.. టీవీ షో ద్వారా వచ్చాడు. వీడు హీరో అవుతాడా అని వెట‌కారంగా మాట్లాడారు. వారి మాట‌లు విన్న ప్ర‌తి ఒక్క‌సారి అస‌లు నన్ను ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారా అని భయం వేసింది. మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా సమయంలో నువ్వు తేడా గాడివా.? అంటూ కూడా దారుణ‌మైన కామెంట్స్ చేశారు సోహైల్. ఎన్నో అవ‌మానాలు ప‌డి సినిమా పూర్తి చేసిన సోహైల్ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మ‌రి ఈ సినిమా ఎంత‌గా అల‌రిస్తుందో చూడాల్సి ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...