Home Film News Samantha: ట్రీట్‌మెంట్‌ కోసం స్టార్ హీరో ద‌గ్గ‌ర రూ.25 కోట్ల అప్పు.. స‌మంత స్పందన ఏంటంటే..!
Film News

Samantha: ట్రీట్‌మెంట్‌ కోసం స్టార్ హీరో ద‌గ్గ‌ర రూ.25 కోట్ల అప్పు.. స‌మంత స్పందన ఏంటంటే..!

Samantha: గ‌త కొద్ది రోజులుగా మ‌యోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత ఆరోగ్యంకి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత త‌న ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ల‌నుంద‌ని, వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం  స్టార్‌ హీరో వద్ద  రూ.25కోట్లు అప్పు తీసుకుందని  తెగ ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో స‌మంత సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ త‌న‌పై రూమర్స్ క్రియేట్ చేసిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది.  మయోసైటిలస్‌ వ్యాధి చికిత్సకి రూ.25కోట్లా? ఎవరు  మీతో డీల్ కుదుర్చుకున్నారు(తప్పుడు సమాచారం ఇచ్చారు). అందులో నేను చాలా తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా అని చెప్పుకొచ్చింది స‌మంత‌.

నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్‌ వ్యాధి ఇప్పుడు వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య. చికిత్సకి సంబంధించి  మేం అందించే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని స‌మంత త‌న పోస్ట్ లో తెలియ‌జేసింది. అయితే స‌మంత పోస్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే తాను  అప్పు చేయాల్సిన స్థితిలో లేనని, తనహెల్త్ ని తాను జాగ్ర‌త్త‌గా చూసుకోగలనని వెల్లడించింది సమంత. మొత్తానికి త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు క్రియేట్ చేసిన వారికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది సామ్.

ప్ర‌స్తుతం స‌మంత వెకేష‌న్‌లో ఉంది. గ‌త కొద్ది రోజులుగా ఆమె టూర్‌లో స‌ర‌దాగా గ‌డుపుతూ వాటికి సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతుంది.ఇటీవ‌ల స‌మంత త‌ను క‌మిట్ అయిన సినిమాల షూటింగ్స్ అన్ని పూర్తి చేసింది. తెలుగులో ఖుషీ అనే సినిమాతో ప‌ల‌క‌రించ‌నుంది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది. ఇక సమంతకి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో  నిర్వహించే 41వ ఇండియన్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ నుంచి  ఆహ్వానం అందుకుంది .  ఆగస్ట్ 20న  న్యూయార్క్ లో జరగనున్న ఈ ప‌రేడ్‌లో స‌మంత పాల్గొన‌నుంది.. స‌మంత‌కి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల ఫ్యాన్స్  ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...