Home BoxOffice 26 ఏళ్ల గుణ శేఖర్ ‘సొగసు చూడతరమా’.. బాక్స్ ఆఫీస్
BoxOffice

26 ఏళ్ల గుణ శేఖర్ ‘సొగసు చూడతరమా’.. బాక్స్ ఆఫీస్

26 Years For Sogasu Choodatharama

గుణ శేఖర్ ఒక డైనమిక్ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఎంతో కాలంగా తన మార్కు సినిమాలు తీస్తూనే పోతున్నాడు. ఈ మధ్య పౌరాణికాలపై ఎక్కువ దృష్టి పెట్టిన గుణశేఖర్ ఒకప్పుడు మంచి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలు కూడా చేశాడంటే నమ్మక తప్పదు. ఐతే, గుణ శేఖర్ తీసిన అలాంటి మూవీస్ లో ఒకటి సొగసు చూడటం తరమా.

ఈ మూవీలో తనికెళ్ళ భరణి, మల్లిఖార్జున రావ్ లు సహాయ నటులుగా కనిపిస్తారు. హీరో నరేష్, నటి ఇంద్రజల మధ్య భార్యా భర్తల కథ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో ఇద్దరు భార్యా భర్తల మధ్య బంధం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలా దెబ్బతింది అన్న నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులని అలరించింది. ఇందులో పాటలు కూడా మంచి గుర్తింపుని సంపాదించాయి.

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే మూవీ పెద్ద హిట్ గానే నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఉత్తమ స్క్రీన్ ప్లే గా గుణ శేఖర్ కి నంది అవార్డ్ వచ్చింది. ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ డైలాగ్ లకి, కాస్ట్యూమ్స్ కి కూడా మరో రెండు నందులు వచ్చాయి. మూవీ మొత్తంగా నాలుగు నందుల్ని గెలుచుకుని కలెక్షన్స్ రూపంలో కూడా కోట్లు కొల్లగొట్టింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....