మెర్సల్, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలతో సౌత్ లో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు రేపు జూన్ 22. ‘దళపతి 65’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. సినిమా 2022 లో తెరమీదకు వస్తుంది. ఇందులో కథానాయికగా పూజ హెగ్డే నటిస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
ఇదే రోజు ఆ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టిన రోజు కావడం విశేషం. కొత్త దర్శకుడిగా ఇలా పెద్ద హీరోతో అతనికి అవకాశం రావడంతో దానిని పూర్తిగా సద్వినియోగ పరుచుకోవాలని అనుకుంటున్నాడు నెల్సన్. ఇలా ఒకే రోజు ఒక సినిమాకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల పుట్టిన రోజుల సందర్భంగా అభిమానులకు ఇలా పోస్టర్ రిలీజ్ చేసి వాళ్లలో ఆనందాన్ని నింపారు సినిమా టీమ్. గతేడాది ఇదే నెలలో రిలీజైన మాస్టర్ విజయ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది.
#Beast pic.twitter.com/VgMlmH1Gno
— Vijay (@actorvijay) June 21, 2021
 
 
 
	 
	 
	 
	 
  
  
  
	 
	 
	 
	 
	 
	 
	 
	
Leave a comment