Home Film News Vishnu Priya: పెళ్లైన హీరో యాంక‌ర్ విష్ణు ప్రియ‌ని చేసుకోవ‌డానికి రెడీగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్
Film News

Vishnu Priya: పెళ్లైన హీరో యాంక‌ర్ విష్ణు ప్రియ‌ని చేసుకోవ‌డానికి రెడీగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్

Vishnu Priya: ‘గులాబి’, ‘సత్య’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ఎగిరే పావురమా’, ‘అనగనగా ఒక రోజు, మ‌నీ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ చిత్రాల‌లో హీరోగా న‌టించి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు జేడీ చ‌క్ర‌వ‌ర్తి. ఒక‌ప్పుడు ఆయ‌న సినిమాల‌కి మంచి క్రేజ్ ఉండేది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న న‌ట‌న‌కి దూరంగా ఉన్న జేడీ చక్ర‌వ‌ర్తి చాలా రోజుల త‌ర్వాత ద‌య అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోషన్స్ లో పాల్గొన్న జేడీ అనేక విష‌యాలు వెల్ల‌డించారు . ఆ మ‌ధ్య యాంక‌ర్ విష్ణు ప్రియ‌.. జేడీపై త‌న‌కి ఉన్న క్ర‌ష్ చెప్పుకొచ్చింది. అంతేకాదు అతనిని పెళ్లి చేసుకోవాల‌ని ఉంది అని కూడా చెప్పింది. ఈ క్ర‌మంలోనే  విష్ణుప్రియా, జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఈ క్ర‌మంలో జేడీ స్పందిస్తూ.. తాను కూడా విష్ణు ప్రియ‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అన్నాడు. త‌న పెళ్లి చేయాల‌ని యాంక‌ర్‌ని కోరాడు.  స్టూడియోలో పెళ్లి చేయండి అని ఫన్నీగా చెప్పాడు. విష్ణు ప్రియ‌ చాలా మంచి అమ్మాయి అని, బాగా నటిస్తుందని చెప్పిన జేడీ  తన సినిమాలు చూసి ఆ ఎగ్జైట్‌మెంట్‌లో తను పెళ్లి గురించి అలా మాట్లాడి ఉంటుంది తప్ప మరేమీ లేదన్నారు. తనని ఆమె ఓ గురువుగా భావిస్తుందే త‌ప్ప మా మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ లేదు అని మ‌రోసారి త‌మపై వ‌చ్చే రూమ‌ర్స్‌కి క్లారిటీ ఇచ్చాడు జేడీ చక్ర‌వ‌ర్తి.

అయితే ద‌యకి మంచి టాక్ రావ‌డంతో స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విష్ణుప్రియ మాట్లాడుతూ… పవన్ సాదినేని టార్చర్ పెడుతారని నాకు ముందే కొందరు చెప్పారు. కానీ మంచి టీమ్ తో పని చేసే అవకాశాన్ని మిస్ కావొద్దని దీనికి ఓకే చెప్పాను అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. ఆ త‌ర్వాత  చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ లో ఓ జర్నలిస్ట్ పాత్రను విష్ణుప్రియకు ఇచ్చాం. అయ‌తే  ఆ పాత్రకు యాక్టింగ్ రాకపోయినా సరే ఫిజిక్ కత్తిలా ఉండాలని మేం ఫిక్స్ అయి విష్ణు ప్రియ‌ని తీసుకున్నాము.విష్ణు ప్రియ‌ది  చైల్డ్ మెంటాలిటీ. ఆమె ఏం చేసినా మేం ఎంజాయ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విష్ణుప్రియకు యాక్టింగ్ రాదని అతను  ఇన్ డైరెక్ట్ గా చెప్పాడా ఏంటి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...