Home Film News Venu Swamy: విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో క్యూట్ క‌పుల్.. వేణు స్వామి కామెంట్స్ వైర‌ల్
Film News

Venu Swamy: విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో క్యూట్ క‌పుల్.. వేణు స్వామి కామెంట్స్ వైర‌ల్

Venu Swamy: ఇటీవ‌ల సెల‌బ్రిటీల విడాకుల వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. ఎంతో అన్యోన్యంగా ఉంటార‌నుకున్న జంటలు ఊహించ‌ని కార‌ణాల‌తో విడాకులు తీసుకుంటున్నారు. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకులు ఎంత పెద్ద సెన్సేష‌న్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట విడిపోవ‌డానికి కార‌ణాలు ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌దు కాని వారికి సంబంధించి ఏవేవో వార్త‌లు నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీరి విడాకుల త‌ర్వాత చాలా మంది జంట‌లు విడిపోయారు. కొన్ని నెల‌ల క్రితం  ఐశ్వ‌ర్య – ధ‌నుష్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక  శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్, నిహారిక- చైతన్యలు సైతం బ్రేక‌ప్ చెప్పుకొని అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచారు. ఇప్పుడు ఆది పినిశెట్టి – నిక్కీ గ‌ల్రానీ కూడా విడిపోతున్నార‌ని అంటున్నారు

సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఎప్పుడు వార్త‌ల‌లో నిలిచే వేణు స్వామి తాజాగా ఆది- నిక్కీ జ్యోతిష్యం చెప్పిన‌ట్టు నెట్టింట ప్రచారం జ‌రుగుతుంది. ఈ ఇద్దరి జాత‌కం క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే   80 శాతం విడిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వీరు క‌లిసి ఉండ‌డం అసాధార‌ణం అని  ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం వేణుస్వామి చేసిన‌ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, కన్నడ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించిన నిక్కీ గల్రానీ  సౌత్ హీరో ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహ వేడుక ఇటీవలే ఘనంగా  జ‌ర‌గ‌గా, వీరి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

2015లో వచ్చిన యాగవరైనుం నా కాక్క చిత్రంలో ఈ జంట తొలిసారిగా కల‌వ‌గా, ఈ సినిమాను తెలుగులో మలుపుగా తీశారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కుదర‌గా, ఆ స్నేహం ప్రేమకు దారితీసింది. వీరిద్ద‌రు మరగధ నానయం అనే చిత్రంలో కలిసి న‌టించారు. ఇక ఆది విష‌యానికి వ‌స్తే తెలుగులో చాలా సినిమాల‌లో న‌టించి మెప్పించాడు ఆది. సుకుమార్ తెర‌కెక్కించిన  రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్‌కు అన్నయ్య పాత్రలో నటించి విమ‌ర్శ‌లు అందుకున్నాడు..  రామ్ పోతినేని వారియర్ సినిమాలో కూడా ఆది పినిశెట్టి విలన్ రోల్ లో న‌టించి అద‌ర‌హో అనిపించాడు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉంటార‌నుకున్న ఆది, నిక్కీ విడిపోతార‌ని వార్త‌లు రావ‌డం అభిమానుల‌ని బాధిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...