Hansika: దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ హన్సిక. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. తెలుగులో ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి నటించిన ఈ అమ్మడు… తెలుగుతోపాటు తమిళ్ లోనూ , అలానే పలు హిందీ సినిమాలలోనూ నటించింది. హన్సికకి తమిళంలో వీరాభిమానులు ఉన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక గుడి కూడా కట్టారు. అయితే హన్సిక ఇటీవల  పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.

హన్సికకి సంబంధించి అప్పుడప్పుడు అనేక పుకార్లు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. కొన్నింటికి హన్సిక స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్నింటిని మాత్రం లైట్ తీసుకుంటుంది. హన్సిక హార్మోనల్ ఇంజక్షన్స్తీసుకొని ఎనిమిదేళ్ల వయసులోనే  నటి అయిందని, వాళ్ల  అమ్మ ఆమెకు  హార్మోనల్   ఇంజక్షన్స్ ఇచ్చి త్వరగా పెద్దదాన్ని చేసిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. దానిపై హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక  హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ..   నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి  ఉంటే కనుక టాటా, బిర్లా  కంటే ధనవంతురాలి  అయ్యే దానిని. ప్రతి ఒక్కరు త్వరగా పెరగడానికి నా దగ్గరికివచ్చేవారు కదా.. ఇలా తప్పుడు  ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి అని  హన్సిక తల్లి  మండిపడింది.
కాగా, హన్సిక మోత్వానీ..సొహైల్ కతూరియాతో గతేడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా వివాహం చేసుకోగా, వివాహం తర్వాత హన్సిక  చాలాగా సన్నబడిపోయింది. అయితే  పెళ్లయ్యాక  ఈ అమ్మడు సన్నగా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.  దీంతో కొందరు బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుందని, అవకాశాల కోసమే అలా చేసిందని చెప్పుకొస్తున్నారు. మరోవైపు సినిమాల్లో అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా కనడం లేదు అంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన హన్సిక..  నేను ఎలాంటి సర్జరీ చేసుకోలేదు.. కానీ వెయిట్ తగ్గడానికి యోగ, వర్కౌట్లు చేస్తున్నాను అని తెలియజేసింది.
 
 
 
	 
	 
	 
	 
  
  
  
	 
	 
	 
	 
	 
	 
	