Home Film News షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత సినిమాల్లో బిజీ అయిన స్టార్లు వీళ్లే!
Film NewsSpecial Looks

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత సినిమాల్లో బిజీ అయిన స్టార్లు వీళ్లే!

ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నేరుగా సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకోవ‌డం అంత సుల‌భం కాదు. అందుకే చాలా మంది మొద‌ట‌ త‌మ టాలెంట్ ను ఏదో ఒక విధంగా ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇందులో భాగంగానే మ‌న టాలీవుడ్ లో చాలా మంది న‌టీన‌టులు షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ త‌ర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు. అటువంటి తెలుగు తార‌లు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Vishwak Sen as Women in his next with?

విశ్వ‌క్ సేన్‌: ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోల్లో విశ్వ‌క్ సేన్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఇత‌ను కేవ‌లం న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, స్క్రీన్ రైటర్ మ‌రియు నిర్మాత‌గా కూడా స‌త్తా చాటుతున్నారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. విశ్వ‌క్ సేన్ కెరీర్ ప్రారంభ‌మైంది ఒక షార్ట్ ఫిల్మ్‌తో. పిట్ట క‌థ అనే ల‌ఘు చిత్రం కోసం విశ్వ‌క్ సేన్ మొద‌టసారిగా కెమెరా ముందుకు వ‌చ్చాడు. 2014లో పిట్ట క‌థ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. ఇప్ప‌టికీ అలానే ఉంది. ఆ త‌ర్వాత 2017లో వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలు చేస్తున్నాడు.

Raj Tarun to play a blind character in 'Andhagadu' - The Statesman

రాజ్ త‌రుణ్‌: ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21F వంటి చిత్రాల‌తో న‌టుడిగా టాలీవుడ్ లో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో రాజ్ త‌రుణ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ తో త‌న న‌ట‌నా ప్ర‌స్థానాన్ని ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 52 షార్ట్ ఫిల్మ్స్ లో రాజ్ త‌రుణ్ న‌టించారు. ఆ త‌ర్వాత సినిమాల్లో వ‌చ్చి బిజీ అయ్యాడు.

Ritu Varma Images: Actress Ritu Varma looks gorgeous in Light Green Saree | Ritu Varma Pics: శారీలో తళుక్కుమన్న రీతు వర్మ.. తెలుగందం మెరిపోతుందిగా! వినోదం News in Telugu

రీతు వ‌ర్మ‌: హైద‌రాబాద్ అమ్మాయి అయిన రీతూ వ‌ర్మ‌.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్‌షా మూవీతో వెండితెర‌పై అడుగుపెట్టింది. ఇందులో కాజ‌ల్ ఫ్రెండ్‌గా గుర్తింపులేని పాత్ర‌ను పోషించింది. పెళ్లి చూపులు మూవీతో హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాల‌తో బిజీ అయింది. అయితే రీతు వ‌ర్మ కూడా షార్ట్ ఫిల్మ్స్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమాల్లోకి రాక‌ముందు అనుకోకుండా అనే ల‌ఘు చిత్రంలో ఆమె న‌టించింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. మరియు రీతు వర్మకు ఉత్తమ న‌టిగా అవార్డును కూడా అందుకుంది. 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌లో కూడా ఈ లఘు చిత్రం ప్రదర్శించబడింది.

From character artist to lead actor: Actor Suhas on his journey in Tollywood

సుహాస్‌: క‌మెడియ‌న్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగి విల‌న్ గానూ అల‌రిస్తున్న న‌టుడు సుహాస్‌.. సినిమాల్లోకి రాక‌ముందు ది అతిధి, కళాకారుడు, రాధికా, నందన్ ది సైకో త‌దిత‌ర షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు. అలా వ‌చ్చిన గుర్తింపుతోనే 2018లో పడి పడి లేచే మనసు మూవీతో క‌మెడియ‌న్ గా వెండితెర‌పై అడుగు పెట్టాడు. కలర్ ఫోటో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో హీరోగా యాక్ట్ చేసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా విల‌న్‌గా, స‌హాయ‌క న‌టుడిగానూ స‌త్తా చాటుతున్నాడు.

Naveen Polishetty : యువ‌ హీరో నవీన్ పోలిశెట్టి ఎక్స్‌క్లూజివ్ ఇంట‌ర్వ్యూ.. ఎంత ఆనందంగా ఉందో.. | Hero naveen polishetty exclusive interview-10TV Telugu

న‌వీన్ పోలిశెట్టి: హైదరాబాద్‌లో జన్మించిన న‌వీన్ పోలిశెట్టి.. న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో ఇంగ్లాండ్‌లో ల‌క్ష‌లు తెచ్చిపెట్టే ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. మొద‌ట యూట్యూబ్ లో ఒక ఛానెల్‌ను ఓపెన్ చేసిన ప‌లు షార్ట్ ఫిల్మ్స్‌, అనేక కామెడీ వీడియోలు చేశాడు. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వ‌చ్చిన న‌వీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత జాతి రత్నాలు, మిస్. శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రాలు చేసి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు.

PHOTOS: Priyanka Jawalkar Raise The Heat In Red Outfit – Filmy Glitz

ప్రియాంక జవల్కార్: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన టాక్సీవాలా మూవీతో గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ ప్రియాంక జవల్కార్.. ఆ త‌ర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే సినిమాల్లోకి రాక‌ముందు ప్రియాంక జవల్కార్.. ఇట్స్ ఎ గార్ల్ ఇష్యూ అనే షార్ట్ ఫిల్మ్ కోసం మొట్ట‌మొద‌టిసారి కెమెరాను ఫేస్ చేసింది.

Chandni Chaudhary Archives - Telugu Journalist

చాందిని చౌద‌రి: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా ఎదిగిన తెలుగ‌మ్మాయి చాందిని చౌద‌రి.. ప్ర‌స్తుతం ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. అయితే చాందిని చౌద‌రి కూడా షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారానే త‌న యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. మ‌ధురం, ది బ్లైండ్ డేట్ వంటి ల‌ఘు చిత్రాలు చేసింది. ఇక వీళ్లే కాకుండా పూజిత పొన్నాడ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ రెడ్డి వంటి వారు కూడా షార్ట్స్ ఫిల్మ్స్ చేశాకే.. సినిమాల్లోకి వ‌చ్చారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...