Home Special Looks ‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!
Special Looks

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

I Was Cheated In Nijam Movie Says Raasi

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో లేదోనన్న తరుణంలో ఒక్కసారిగా ఆమె ఎవ్వరూ ఊహించని పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, గోకులంలో సీత, స్నేహితులు, దేవుళ్ళు వంటి సినిమాలలో ఒక హీరోయిన్ గా నటించిన వ్యక్తి ఇలాంటి పాత్ర పోషించటం ఏంటి అనుకున్నారంతా.. ఆ సినిమానే రాశి గోపీచంద్ లవర్ గా నటించిన నిజం మూవీ.

రాశి ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇండస్ట్రీ కి చాలా గ్యాప్ ఇవ్వడం.. మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రయత్నించినపుడు ఆమెకి మార్కెట్ లేకపోవడం వల్ల అవకాశాలు రాకపోవడం ఆమెని ఇబ్బందుల్లో పడేశాయని అనుకోవచ్చు. ఆ మధ్య ఒకసారి ఆమె ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినపుడు ఈ విషయం తెలియజేయడం విశేషం. అప్పటిదాకా అవకాశాలు లేకపోవడం, మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తేజని నమ్మి ఒక రోల్ చేస్తానని చెప్పడం, ఆయన ప్రేమ కథ అని చెప్తే అందులో నటిస్తానని చెప్పడం, తీరా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి చూశాక అక్కడ గోపీచంద్ తో వల్గర్ రొమాన్స్ చేయాల్సిన అవసరం ఉండడం చూశాక ఆమె షాక్ కి గురై పోయింది.

ఇందులో నా రోల్ ఇదీ అని ఆమెకి క్లారిటీ వచ్చిన తర్వాత.. వెంటనే తన PR కి చెప్పి ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించమని చెప్పింది. కానీ, అప్పటికే ఒకసారి పాత్ర ఒప్పుకున్నాక ఇలా మధ్యలో వెళ్లిపోతే.. మొత్తం ఇండస్ట్రీలోనే చెడ్డపేరు వస్తుందని కన్విన్స్ ఐన ఆమె ఈ ఒక్కసారికి ఈ రోల్ చేసేయడమే బెస్ట్ అనుకుని ఆ సినిమా అలా ముగించిందట. ఇక నుంచి ఏదైనా పాత్ర ని సెలెక్ట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుందట. పాత్ర ఖచ్చితంగా ఇలా ఉంటుందని తేజ గారు స్పష్టంగా చెప్పకపోవడాన్ని రాశి చీటింగ్ గా భావించారట. ఏది ఏమైనా.. ఆమె అందానికి అట్రాక్ట్ ఐన వాళ్ళకి ఆమెని అలా చూడాలన్న ఆశ చాలావరకు తీరింది అనుకోవచ్చు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...

చెవిటి, మూగ అయినా అందం ‘అభినయం’ ఆమెని ఆపలేదు..

ఆమెకి చెవులు వినిపించవు. మాట్లాడటం కూడా రాదు. కానీ, తెలుగు తమిళ రెండు భాషల్లోనూ చాలా...