Home Film News JD Chakravarthy: జేడీ చ‌క్ర‌వ‌ర్తి భార్య ఆయ‌న‌కి విషం ఇచ్చి చంపాల‌నుకుందా.. అస‌లు నిజం ఏంటంటే..!
Film News

JD Chakravarthy: జేడీ చ‌క్ర‌వ‌ర్తి భార్య ఆయ‌న‌కి విషం ఇచ్చి చంపాల‌నుకుందా.. అస‌లు నిజం ఏంటంటే..!

JD Chakravarthy: జేడీ చ‌క్ర‌వ‌ర్తి పేరు ఇప్ప‌టి వాళ్ల‌కి పెద్దగా తెలియ‌క‌పోవ‌చ్చు కాని  పాత త‌రం వారికి మాత్రం చాలా సుప‌రిచితం. హీరోగా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి రీసెంట్‌గా ద‌యా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా జేడీ చ‌క్ర‌వ‌ర్తి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కి స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తి విషం పెట్టార‌ని , త‌న‌కి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేక‌పోవ‌డం వ‌ల‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాన‌ని జేడీ అన్నారు. అయితే జేడీ చక్రవర్తి.. తన భార్య విషం పెట్టిందని చెప్పకపోయినా థంబ్ నెయిల్ లో తప్పుగా పేర్కొనడంతో ఆమెనే విషం పెట్టిన‌ట్టు ప్ర‌చారం సాగింది. తన భార్యపై దారుణంగా ట్రోల్స్ వస్తుంటే వాటిపై ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు జెడి చక్రవర్తి.

నా భార్య నాకు విషం పెట్టింద‌ని చెప్ప‌క‌పోయిన కూడా కొంద‌రు కావాల‌ని యూట్యూబ్ థంబ్ నెయిల్ పెట్టి మా జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని జేడి చక్ర‌వ‌ర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నా భార్య నాకు ఏ రోజు అన్యాయం చేయ‌లేద‌ని కూడా ఆయ‌న అన్నారు.  నా భార్య నాకు స్లో పాయిజన్ ఇచ్చారని నేను ఎప్పుడు చెప్ప‌లేదు.ద్రోహం దగ్గరుండే వాళ్లు మాత్రమే అలాంటి పనులు  చేయగలరని ఆయన వెల్లడించారు.డాక్టర్ నాగార్జున గారి వల్ల నేను కోలుకోవడం సాధ్యమైందని జేడీ చక్రవర్తి స్ప‌ష్టం చేశారు. జేడి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇక తాను ఎప్పుడో క్రైమ్ చేసిన‌ట్టు చెప్పిన జేడి… శివ సినిమాకి ముందే ఆ క్రైమ్ చేసిన‌న‌ట్టు స్ప‌ష్టం చేశారు.  పెళ్ళికొడుకు గెటప్ లో ఉండి షూట్ లో పాల్గొంటే  పెళ్లి అయిపోయినట్టేనా అంటూ జేడీ ప్ర‌శ్నించారు. తన‌కి ఏ సినిమాలో ఏ గెటప్ వేస్తే ఆ గెటప్ లో ఫోటో తీసుకోవడం అలవాటు అనా స్ప‌ష్టం చేశారు జేడి. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌ల  జేడీ చక్రవర్తిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. సత్య తర్వాత చాలా సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. ఆ స్క్రాప్‌ పీరియడ్‌ లో ఏం చేశారు అన్నట్లుగా ఆమె ప్ర‌శ్నించింది. దానికి స్పందించిన ఆయ‌న .. ఆ స్క్రాప్‌ పీరియడ్‌ వల్లే నీలాంటి వారితో కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటూ కాస్త ఘాటుగా స్పందించ‌డంతో యాంకర్ ఫేస్ చిన్న‌బోయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...