Home Film News Prashant Neel: ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే.. నాటుకోడి పులుసు పంపించిన ఎన్టీఆర్
Film News

Prashant Neel: ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే.. నాటుకోడి పులుసు పంపించిన ఎన్టీఆర్

Prashant Neel: క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పేరు కేజీఎఫ్ అనే సినిమాతో దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.  యశ్ ప్రధాన పాత్రలో ఆయన   తెరకెక్కించిన కేజీఎఫ్  సినిమా రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టి సంచ‌ల‌నం సృష్టించింది. కేజీఎఫ్ చిత్రంతో  యష్, నీల్ ఇద్దరికీ పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కింది. కేజీఎఫ్ అందించిన విజ‌యంతో  కేజీఎఫ్ 2 అనే చిత్రం చేసి మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేసారు ప్ర‌శాంత్ నీల్‌. ఇప్పుడు ఆయ‌న ప్ర‌భాస్ తో స‌లార్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ ఇద్దరు క్రేజీ స్టార్లు కావడం, వారిరివురు కలిసి చేస్తుండడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇక అంచనాలకి అనుగుణంగానే  అత్యంత భారీ బడ్జెట్‌తో హై లెవెల్‌లో స‌లార్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక స‌లార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే జూన్ 4న కావ‌డంతో ఆయ‌నకి కన్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ నుండే కాక తెలుగు సినీ పరిశ్ర‌మ నుండి కూడా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఇక స‌లార్ సెట్స్ లో ప్ర‌భాస్.. ప్ర‌శాంత్ నీల్ వేడుక‌లు నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఇక మెగా ప‌వర్ స్టార్  రామ్ చరణ్ త‌న‌ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు.  గ్రేట్ బర్త్ డే, గ్రేట్ ఇయర్ అంటూ ప్ర‌శాంత్ నీల్‌కి విషెస్ తెలియ‌జేశారు. త్వ‌ర‌లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లోను ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం రూపొందనుంది.

మరోవైపు ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు . స్టార్ డైరెక్ట‌ర్‌ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. నాటు కోడి పులుసు పంపించారు తారక్. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇక ప్ర‌భాస్‌తో స‌లార్ చిత్రం  పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు ప్రశాంత్ నీల్‌. ఈ చిత్రం కూడా భారీ రేంజ్‌లో ఉండ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. మరోవైపు ఇప్పుడు, ‘KGF: చాప్టర్ 3′(KGF 3) సినిమాపై కూడా అంద‌రిలో  చాలా అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి కొంత టైం ప‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...