Home Special Looks ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!
Special Looks

ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

Other Language Directors Who Made Only One Film In Telugu

భాష మారినా దర్శకుడికి తను చూపించాలనుకున్న కథని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్న వాళ్లయినా సరే.. తెలుగులో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే, తెలుగు దర్శకులైన కె. విశ్వనాథ్, రవిరాజా పినిశెట్టి, దాసరి నారాయణ రావ్, ఇంకా రామ్ గోపాల్ వర్మ వంటి నేటి దర్శకులు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేసారు. కేవలం ఒకట్రెండు సినిమాలు కూడా కాదు. చాలానే చేసారు. ఐతే, వేరే భాషల నుండి మన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం.

ముందుగా బాలీవుడ్ “మహేష్ భట్” నుండి మొదలుపెడదాం. మహేష్ భట్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలని చేసారు. అలాంటి డైరెక్టర్ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న నాగార్జునతో ‘క్రిమినల్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ ఆయన చేయడానికి మరో కారణం.. ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నం కూడా జరిగింది.

ఇక తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది తెలుగులో ఒక సినిమా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి “మణిరత్నం”. ఈ మూవీకూడా నాగార్జున హీరోగా వచ్చిందే. అదే ‘గీతాంజలి’. మణిరత్నం చేసిన ఒక్కగానొక్క ఈ క్లాసిక్ తెలుగులో ఆయన స్ట్రైట్ ఫిల్మ్. ఇక నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న “ప్రతాప్ పోతన్” కూడా తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. విశేషం ఏంటంటే ఇది కూడా నాగార్జున హీరోగా చేసిన సినిమానే. అదే ‘చైతన్య’. ఇంకా చెప్పాలంటే “ఫాజిల్” అనే మరో తమిళ దర్శకుడు కూడా నాగార్జున హీరోగా ఒకే ఒక్క స్ట్రైట్ తెలుగు సినిమా చేశారు. అదే ‘కిల్లర్’.

మరో తమిళ దర్శకుడు “విష్ణువర్ధన్” పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ అనే స్ట్రైట్ సినిమా చేశారు. అదే పవన్ కళ్యాణ్ హీరోగా మరో తమిళ దర్శకుడైన “ధరణి” చేసిన స్ట్రైట్ ఫిల్మ్ ‘బంగారం’. “అదయమాన్” అనే దర్శకుడు ‘బొబ్బిలి వంశం’. “సుబ్రహ్మణ్యం శివ” అనే మరో తమిళ్ దర్శకుడు ‘దొంగ దొంగది’. “షాజీ కైలాష్” మంచు విష్ణు హీరోగా ‘విష్ణు’ సినిమా చేశారు. ఇక “అగస్త్యన్” రవితేజ హీరోగా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొట్టడం చెప్పుకోవాల్సిన విషయం.

ఇక కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఉపేంద్ర నటించిన సినిమాలు చాలావరకు తెలుగులో డబ్ అయ్యాయి. వాటితో పాటు తెలుగులో నేరుగా ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా పేరు రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఓం’. మరో కన్నడ దర్శకుడు “పవన్ వడేయార్” మంచు మనోజ్ హీరోగా ‘పోటుగాడు అనే మూవీ చేశారు. అలాగే బెంగాలీ దర్శకుడైన గౌతం ఘోష్ ‘మా భూమి’ అనే సినిమా చేశారు. ఈ మూవీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉద్దేశించి ఉంటుంది. బెంగాలీవాడైనా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన సినిమా చేయడం విశేషం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...