Vakeel Saab Beauty: తెలుగింటి సీతమ్మగా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది అంజలి. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కూడా ఎందుకో కెరియర్ అంత ఆశాజనకంగా లేదు. ఇటీవల వకీల్ సాబ్లో అంజలికి మంచి పాత్ర దక్కింది. ఈ పాత్రకిగాను అంజలిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ భామ కేవలం కథానాయికగానే కాకుండా సపోర్టింగ్ పాత్రలలోను మెప్పిస్తుంది. అంజలి తొలిసారి షాపింగ్ మాల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను సైతం అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలో కూడా నటించిన ఈ బొద్దుగుమ్మకి తమిళంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇప్పుడు అంజలి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు ఇలా ఏ ఛాన్స్ వచ్చిన కూడా నో చెప్పడం లేదు. గతంలో అంజలి తన కుటుంబ సభ్యులతో గొడవపడగా, ఆ విషయం ఎంత హాట్ టాపిక్ అయిందో మనం చూశాం.  ఆస్తుల పంపకాల విషయంలోనే అంతగా గొడవలు జరిగినట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం కోర్టుమెట్ల వరకు వెళ్లగా, ఆ తర్వాత ఈ వివాదం గురించి ఎలాంటి వార్తలు అయితే రాలేదు. ప్రస్తుతం అంజలి ఆస్తులకి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.  అంజలి చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ, రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకున్నా ఆస్తులు మాత్రం భారీగానే కూడబెట్టిందట.
అందాల భామ అంజలి ఆస్తులు అన్నీ కలుపుకుని… దాదాపు 200 కోట్లకు పైగా ఉన్నట్టు  ప్రచారం జరుగుతుంది. ఈ అమ్మడికి  హైదరాబాదులోనే కాకుండా చెన్నైలో కూడా భారీగానే ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లను మించి ఈ అమ్మడు ఆస్తులని ఎలా సంపాదించింది అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తమిళనాడు బ్యూటీ అంజలి ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టింది.  తన కెరీర్లో 50  సినిమాల మైలురాయిని చేరుకుంది.ప్రస్తుతం రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలానే విశ్వక్ సేన్ మూవీ కూడా చేస్తుంది.
 
 
 
	 
	 
	 
	 
  
  
  
	 
	 
	 
	 
	 
	